English | Telugu

మాటతీరు మార్చుకోకపోతే స్టేజ్ మీద ఉంటావ్.. నామినేషన్లోకి రండి మేడమ్!

బిగ్ బాస్ సీజన్-8 లో పదమూడో వారం వీకెండ్ నాటి శనివారం ఎపిసోడ్ లో భాగంగా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ లోని అందరికి బైబై చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చిన తేజకి హగ్గు ఇచ్చి పలకరించాడు నాగార్జున. ఇక తేజ జర్నీ వీడియో ప్లే చేశారు. యష్మీ కిస్ ఇస్తానన్న సీన్, బస్తాల టాస్కులో తేజ ఇరగదీసిన తీరు, రోహిణి, అవినాష్‌లతో కలిసి చేసిన కామెడీ ఇలా జర్నీ వీడియోను బ్యూటిఫుల్‌గా ఎడిట్ చేశారు. ఇక హౌస్‌లోకి మీ పేరెంట్స్ రారు అన్నప్పుడు తేజ ఎమోషనల్ అయిన వీడియోలు.. తర్వాత వాళ్ల అమ్మ గారు లోపలికి వచ్చినప్పుడు ఎమోషన్స్‌తో జర్నీ వీడియోను పూర్తి చేశారు. అమ్మ వచ్చిన వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు తేజ.

ఇక స్టేజ్ మీద కూరగాయల ఫొటోలు పెట్టి ఏది ఎవరికి డెడికేట్ చేస్తావో చెప్పమన్నాడు నాగార్జున. అవినాష్ అన్నా.. ఆటల్లో సూపర్ మాట పరంగా కూడా ఎక్కడా తగ్గకు.. ఇంత టఫ్‌ కాంపిటేషన్‌లో కూడా గెలిచాడు.. చాలా హ్యాపీగా ఉంది.. నాకు కిచెన్‌లో ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేశాడు. సో అన్నకి ఉల్లిగడ్డలు ఇస్తున్నానంటూ తేజ చెప్పాడు. ఇక రోహిణి మేడమ్ గెలిచి మెగా చీఫ్ అయినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను.. ఆవిడ గెలిచినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయ్.. మన టీమిండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు ఏడ్చా.. మళ్లీ రోహిణి గారు గెలిచాకే ఏడ్చా.. ఆవిడకి బంగాళదుంప ఇస్తున్నానంటూ తేజ అన్నాడు. కానీ నామినేషన్స్‌కి రాకపోవడమే మీకు మైనస్ మేడమ్.. వచ్చే వారం ప్లీజ్ రండి అంటూ తేజ అన్నాడు.

ఆటల్లో కూడా పర్సనాలిటీని చూసుకోండి.. ఎందుకంటే అక్కడ కూడా ఫెయిర్‌గా ఆడటం ముఖ్యమంటూ విష్ణుప్రియకి కాకరకాయ ఇచ్చాడు తేజ. అయితే దీనికి కూడా విష్ణుప్రియ తనకి అనుకూలంగా చెప్పుకుంటూ చేదుగా ఉన్నా కాకరకాయ మంచిదంటూ చెప్పింది. ఆ తర్వాత పృథ్వీలో కూడా ఫన్ యాంగిల్ ఉంది.. కానీ మాకు అగ్రెషన్ ఏంగిల్‌యే ఎక్కువ చూపించాడు. విష్ణుప్రియని మధ్యలో వదిలేసినట్లు గేమ్స్ కూడా వదిలేయకంటూ పృథ్వీకి పచ్చి మిర్చి ఇచ్చాడు. ఆ తర్వాత మా వోడు గౌతమ్‌కి క్యాబేజ్ ఇస్తా సర్.. ఎందుకంటే పొర తీస్తే వస్తానే ఉంటుంది క్యాబేజ్‌కి అలానే గౌతమ్‌లో ఎంత తీసినా కొత్త యాంగిల్ ఉంటుంది.. మనోడు ఖచ్చితంగా టాప్-2లో ఉంటాడని నా గట్ ఫీలింగ్ అంటూ తేజ అన్నాడు. నువ్వు మాటతీరు మార్చుకోలేకపోతే వచ్చే వారం నాగార్జున సర్ పక్కన నువ్వుంటావ్.. సీరియస్‌గా చెబుతున్నానంటూ ప్రేరణకి బెండకాయ ఇచ్చాడు. నువ్వు కన్ఫ్యూజన్‌లో ఉన్నావ్.. వైల్డ్ కార్డ్స్ రాకముందు టాప్-3లో ఉండేవాడివి కానీ ఇప్పుడు టాప్ -5లోనే ఉన్నావ్ .. ఏమైందో చూసుకొని సరిచూసుకోమంటూ నబీల్‌కి టమాటా డెడికేట్ చేశాడు. ఎమోషనల్‌గా వీక్.. చాలా డౌన్ అయ్యావ్.. నువ్వు పుషప్ చేసుకొని ఇంకా ముదుకు రావాలంటూ నిఖిల్ కి సొరకాయ డెడికేట్ చేశాడు తేజ. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోటి డెడికేట్ చేసి అందరికి బై చెప్పి వచ్చేశాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.