అమ్మా నువ్వు లేని జీవితం ఏమీ బాలేదు
బిగ్ బాస్ సీజన్ 5లో శ్వేతా వర్మ గురించి అందరికీ తెలిసిందే. ఐతే ఆమె సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. '2017 డిసెంబర్ 2 తెల్లవారుజామున 2:35 గంటలకు నన్ను వదిలేసి మా అమ్మ భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోయింది' అంటూ ఆమె తన తల్లిని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టింది. 'నీ తోడు, నీ నీడ నాకు దేవుడు ఇచ్చిన బహుమతి. నీలాంటి వాళ్లు ఎప్పటికీ నాకు దొరకరు. నేను, నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నువ్వు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు లేకుండా జీవితం ఏం బాలేదు' అని భావోద్వేగానికి లోనైంది శ్వేతా వర్మ. అని మరో పోస్ట్ పెట్టింది శ్వేత. దీంతో పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్వేతా వర్మకు ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.