English | Telugu

బేబక్కలో ఇన్ని వేరియేషన్సా...వామ్మో



బిగ్‌బాస్‌ 8 తెలుగు సీజన్‌ లో బెజవాడ బేబక్క అలరించింది. ఆమె సోషల్ మీడియాలో తన స్టైల్ మోడ్యులేషన్ తో ఫుల్ ఫేమస్ అయ్యింది. కరోనా టైంలో ఆమె రీల్స్‌ బాగా వైరల్‌ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు కంటే వెళ్లొచ్చాక ఇన్స్టాగ్రామ్ లో బేబక్క ఫాలోయింగ్ ఇంకా పెరిగిపోయింది. ఐతే రీసెంట్ గా ఒక ఫండ్ రైజింగ్ షోలో ఆమె ఎంటర్టైన్ చేసింది.

దానికి సంబందించిన ఒక సాంగ్స్ రిహార్సల్స్ చేస్తూ ఒక వీడియొని పోస్ట్ చేసింది. ఇందులో మరో సింగర్ విఖ్యాత్ సాయిరాంతో కలిసి పాటలు పాడింది. ఇక నెటిజన్స్ చూడండి బేబక్కకు మాములుగా కామెంట్స్ పెట్టలేదు. "బేబక్క సాంగ్ ని బ్లాస్ట్ చేసింది. ఎందుకు అంత రఫ్ గ పాడుతున్నారు స్మూత్ గా పాడొచ్చు కదా...బేబక్క నీ దగ్గర ఈ కలలు కూడా ఉన్నాయా...ఎం చేస్తున్నారు మేడం మీరు. ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త కొత్త అవతారంతో బయపెట్టిస్తున్నారు. అక్క నువ్వు సింగర్ ఐపోవచ్చు..బేస్ వాయిస్ మీరు. సూపర్ సింగర్ మీరు" అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. బెజవాడ బేబక్క సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్ గా , యూట్యూబ్‌ స్టార్‌గానే అందరికి తెలుసు . అంతే కాదు ఆమె ఒక యాక్టర్, సింగర్, మిమిక్రీ ఆర్టిస్టు కూడా. బేబక్క తెలుగులో "అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ", "24 కిసెస్‌", "మళ్లీ పెళ్లి" వంటి 20 సినిమాల్లో ఆమె నటించింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.