అమ్మో లారెన్స్.. పది పార్టులా??
సీక్వెల్ సినిమాకే కొత్త అర్థం చెప్పేలా ఉన్నాడు రాఘవ లారెన్స్. హారర్ కామెడీ జోనర్లో ముని తీశాడు. అది హిట్టయ్యింది. దానికి సీక్వెల్గా కాంచన తీశాడు. అదీ ఆడింది. అందుకే గంగని వదిలాడు. ఒకటి, రెండు, మూడు.. ఇలా ఇక్కడితో ఆపడట. ఏకంగా ఈ కథని పది పార్టులగా తీస్తానంటున్నాడు.