English | Telugu

'రామ్‌' రామ‌.. ఎంత ప‌నిచేశావ్..?

మొన్నామ‌ధ్య పారితోషికం పూర్తిగా చెల్లించ‌లేద‌ని `టెంప‌ర్‌` సినిమాకి డ‌బ్బింగ్ చెప్ప‌లేద‌ని ఎన్టీఆర్‌పై గాసిప్పులొచ్చాయి. కొంత‌మంది పెద్ద‌లు మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించార‌ని, డబ్బులు చెల్లించాకే ఎన్టీఆర్ డ‌బ్బింగ్‌చెప్పాడ‌ని... ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చెప్పుకొన్నారు. ఇప్పుడు రామ్ కూడా అలానే చేస్తున్నాడ‌ట‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం పండ‌గ‌చేస్కో. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొంది. కానీ రామ్ మాత్రం డ‌బ్బింగ్ కి రావ‌డం లేద‌ట‌. దానికి కార‌ణం.. నిర్మాత ఇంకా రామ్‌కి రూ.50 లక్ష‌లు చెల్లించాల‌ట‌. ఆ డ‌బ్బులిస్తే గానీ డ‌బ్బింగ్ చెప్ప‌ను అంటున్నాడ‌ట రామ్‌. అయితే ఈ సినిమాకి ఇప్ప‌టికే ఓవ‌ర్ బ‌డ్జెట్ అయ్యింద‌ని, బిజినెస్ మొద‌లవ్వ‌గానే డ‌బ్బులు ఇచ్చేస్తాన‌ని నిర్మాత బ‌తిమాలుతున్నా రామ్ ఒప్పుకోవ‌డం లేద‌ట‌. డ‌బ్బులిస్తేనే.. డ‌బ్బింగ్ అంటూ కండీష‌న్ పెట్టాడ‌ట‌. దాంతో... ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల్లో జాప్యం జ‌రుగుతోంది. ఆ నిర్మాత క్యాష్ ఎప్పుడిస్తాడో, ఈ హీరో డ‌బ్బింగ్ థియేట‌ర్ లోకి ఎప్పుడు అడుగుపెడ‌తాడో, ఈసినిమా ఎప్పుడు పూర్త‌వుతుందో..??