English | Telugu

లయన్‌ డేట్ మారిందా?

టాలీవుడ్‌లో ఏమిటో ఈ కన్ఫ్యూజన్‌. రిలీజ్‌ డేట్లు మార్చి మార్చి జనాల్ని తెగ కన్ఫ్యూజ్‌ చేసేస్తున్నారు నిర్మాతలు. లయన్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ను ఇప్పటికి ఎన్నిసార్లు మార్చారో లెక్కలేదు. మళ్లీ ఇప్పుడు డేటు మారిందంటున్నారు. మే 1 నుంచి 8కు వాయిదా అంటున్నాడు. ఇంతకుముందు మే 1న కాకుండా ఏప్రిల్‌ 30న విడుదల అనుకున్నారు. మళ్లీ 1కి మార్చారు. డీటీఎస్‌ మిక్సింగ్‌ నిపుణులు మధుసూదన్‌ రెడ్డి మృతితో అనుకోకుండా ఏనిమిదో తారీఖుకి సినిమా వాయిదా పడింది. బహుశా శుక్రవారం సెంటిమెంటుతో డేటు మార్చి ఉండొచ్చని అంటున్నారు. ఏదైనా ఆర్థిక సమస్యలతో నెలలు నెలలు వాయిదా పడటం మామూలే కానీ.. చిన్న చిన్న కారణాలతో ఇలా డేటు పదే పదే మారుస్తుంటే బాలయ్య అభిమానులు తెగ కన్ఫ్యూజ్‌ అయిపోతున్నారు. ఎడో తారీఖైనా సినిమా పక్కాగా వస్తుందా లేదా అని ఫ్యాన్స్‌ కంగారు పడుతున్నారు. లెజెండ్‌ లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో లయన్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.