మాస్ ఇమేజీ కావాలా నాయనా..
ఈ యంగ్ హీరోలున్నారే.. అస్సలు మారరు. ఒకట్రెండు సినిమాలు చేస్తారో లేదో... అర్జెంటుగా మాస్ ఇమేజీ తెచ్చేసుకోవాలని, లేదంటే నిద్రపోయేది లేదన్నట్టు భీష్మించుకొని కూర్చుంటారు. కొన్నాళ్లు లవర్ బోయ్ పాత్రలు చేయండ్రా అంటే వినరే. నితిన్, నాగచైతన్యలకు ప్రేమకథలు చక్కగా సూటవుతాయి. కానీ.. మాస్ కథలంటూ ఎగబడి కొన్ని ఫ్లాపులను కోరి తెచ్చుకొన్నారు. ఇప్పుడు నాగశౌర్య కూడా మాస్ మాస్ అంటూ మాస్ మంత్రం జపిస్తున్నాడు. ఊహలు గుసగుసలాడే, లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాలతో పక్కింటబ్బాయి పాత్రలో కనిపించాడు. రెండు సినిమాలకే లవర్‌బోయ్ పాత్రలు బోర్ కొట్టేసినట్టు ఇక మాస్ పాత్రల్లోకి