English | Telugu

ఆసుప‌త్రిలో మ‌ణిర‌త్నం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం గుండెపోటుకి గుర‌య్యారు. ప్ర‌స్తుతం డిల్లీలోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. షూటింగ్ ప‌నుల‌మీద శ్రీ‌న‌గ‌ర్‌లో ఉన్న మ‌ణిర‌త్నానికి మంగ‌ళ‌వారం సాయింత్రం గుండెపోటు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అప్ప‌టిక‌ప్పుడు కుటుంబ‌స‌భ్యులు ఆయ‌న్ని డిల్లోఈలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. యువ స‌మ‌యంలోనూ ఆయ‌న‌కు ఓ సారి గుండెనొప్పి వ‌చ్చింది. ''మ‌ణిర‌త్నం అనారోగ్యానికి గుర‌య్యారు. అంత‌కు మించిన వివ‌రాలేం చెప్ప‌కూడ‌ద‌ని కుటుంబ స‌భ్యులు చెప్పారు. అందుకే.. వాటిని బ‌య‌ట పెట్ట‌డం లేదు'' అని ఆసుప‌త్రి వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఓకే బంగారం ఇటీవ‌లే విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకొంది. ఈ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు త్వ‌ర‌గా కోలుకోవాలని తెలుగువ‌న్ ఆకాంక్షిస్తోంది. గెట్ వెల్ సూన్ సార్‌.