English | Telugu

రాఘ‌వేంద్ర‌రావు హీరో, కాజ‌ల్ హీరోయిన్‌...

రాఘ‌వేంద్ర‌రావు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. అందులో కాజ‌ల్ హీరోయిన్‌. వీరిద్ద‌రితో కూలీ నెం.1 సినిమాని రీమేక్ చేయ‌బోతున్నారు. కంగారు ప‌డ‌కండి. ఇదంతా కాజ‌ల్ ఫాంట‌సీ మాత్ర‌మే. రాఘ‌వేంద్ర‌రావు నిర్వ‌హిస్తున్న సౌంద‌ర్య‌ల‌హ‌రి కార్య‌క్ర‌మంలో కాజ‌ల్ పాల్గొంది. ఒక వేళ రాఘ‌వేంద్ర‌రావు క‌థానాయ‌కుడిగా న‌టిస్తే.. మీరు క‌థానాయిక‌గా చేస్తారా అనే ప్ర‌శ్న‌కు కాజ‌ల్ స‌మాధానం ఇచ్చింది. ''త‌ప్ప‌కుండా న‌టిస్తా. ఆ సినిమా కూలీ నెం.1లా ఉండాలి..'' అంది. కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తానంటే.. నేను హీరో అవ‌తారం ఎత్త‌డానికి రెడీ అన్నారు.. రాఘ‌వేంద్ర‌రావు. ఒక‌వేళ రాఘ‌వేంద్ర‌రావుతో ఓ సినిమా తీయాలంటే ఎలాంటి సినిమా తెర‌కెక్కిస్తారు? అనే ప్ర‌శ్న నానికి ఎదురైంది. ''నేను స‌ర్కార్ లాంటి సినిమా తీస్తా..'' అని నాని స‌మాధానం ఇచ్చాడు. రానా అయితే రాఘ‌వేంద్ర‌రావుని విల‌న్ గా చూపిస్తాడ‌ట‌. అలాంటి పాత్ర అయితే నాకు బాగుంటుంద‌ని.. ద‌ర్శ‌కేంద్రుడూ స‌మాధానమిచ్చాడు. అంటే... రాఘ‌వేంద్ర‌రావుకి కెమెరా ముందు రావ‌డం ఇష్ట‌మే అన్న‌మాట‌. మ‌రి ఆ త‌రుణం ఎప్పుడో కాల‌మే చెప్పాలి.