English | Telugu
డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో మెరిసిన సాధ్వి మజుందార్
Updated : Feb 20, 2025
డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ప్రోమో ఫుల్ జోష్ తో కొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఇందులో ఎన్నో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ముందుగా సాధ్వి మజుందార్ తన డాన్స్ ఫార్మ్ తో స్టేజి మీద ఫైర్ పుట్టించేసింది. ఐతే సాధ్వి ఫేమస్ హిట్ మూవీ శ్యామ్ సింగరాయ్ లోని "దీన్ తానా" అనే సాంగ్ కి అద్భుతంగా చేసింది. దాంతో జడ్జెస్, మెంటార్స్ అంతా ఫిదా ఇపోయారు. ఆ తర్వాత యాంకర్ ఓంకార్ సాధ్వి గురించి చెప్పారు. శ్యామ్ సింగరాయ్ మూవీలో సాయి పల్లవితో ఆపోజిట్ సైడ్ లో ఉండి పోటాపోటీగా డాన్స్ చేసిన ఆ సాధ్వినే ఈమె అని పరిచయం చేసారు.
ఇక ఫారియా అబ్దుల్లా ఐతే ఆ డాన్స్ కి తనకు గూస్ బంప్స్ వచ్చేశాయని చెప్పింది. ఇక మానస్ ఐతే "అమ్మవారిలో ఎన్ని రూపాలైతే ఉంటాయో అన్ని రూపాలని ఈ డాన్స్ లో చూపించారు. ఇక ఈ సాధ్వి గురించి చెప్పాలంటే ఈమె త్రిపురలోని అగర్తలాలో ఫిబ్రవరి 18, 1998న పుట్టింది. ఫేమస్ కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్ కూడా, ఆమె "డాన్స్ ఇండియా డ్యాన్స్," "ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్," మరియు "ఇండియాస్ డ్యాన్సింగ్ సూపర్ స్టార్" వంటి రియాలిటీ షోస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2015లో 'డాన్స్ ఇండియా డ్యాన్స్' ఐదవ సీజన్ ద్వారా ఆమె బుల్లితెర మీద అరంగేట్రం చేసింది. అలాగే "సాంధ్ కీ ఆంఖ్" మూవీలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసింది. ఇక సాధ్వి తన యూట్యూబ్ ఛానల్ లో డ్యాన్స్ ట్యుటోరియల్ వీడియోస్ ని షేర్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఆమె మన తెలుగు డాన్స్ ఐకాన్ లో పార్టిసిపేట్ చేసి చక్కని వన్నె తెచ్చింది.