English | Telugu

బిగ్ బాస్ లో బద్ద శత్రువులు....ఇప్పుడు ఆదర్శ మిత్రులు


ప్రియాంక జైన్-భోలే షావలి అంటే చాలు బిగ్‌బాస్ సీజన్-7లో జరిగిన గొడవే గుర్తొస్తుంది. అంతలా గొడవ పడిన వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే 'భోలే అంటే హీరో' అనే టైటిల్‌ తో రాబోతోంది. ఇక రీసెంట్ వీళ్ళు ఫ్యామిలీ స్టార్స్ ఎపిసోడ్ షూటింగ్ కి వెళ్తూ కలిసి ఒక వీడియో చేశారు. దాన్ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు భోలే. "హాయ్ ఒక్కసారి జస్ట్ కెమెరా అటు తిప్పుతా అంటూ ప్రియాంక జైన్ వైపు కెమెరా తిప్పి చూడండి సాహసవీరుడు సాగరకన్య సినిమాలో హీరోయిన్‌లా మెరిసిపోతున్నావ్ .." అంటూ ప్రియాంకని పొగిడేసాడు భోలే. దీంతో ప్రియాంక కూడా "మీరెలా ఉన్నారు" అంటూ పలకరించింది.

"హీరోనే కానీ హీరోలా ఉన్నా అనొద్దు ...నువ్వు హీరోయిన్‌లా ఉన్నావ్.. కానీ నీ దగ్గర నేను హీరోలా ఉన్నా అనడానికి నాకు కొంచెం సిగ్గుగా ఉంది.. ఎందుకంటే నాకు అంత సీన్ లేదు.." అన్నాడు భోలే. దానికి ప్రియాంకా సెటైర్ వేసింది. " ఏంటి మీకు బుగ్గాలొచ్చాయి" అని అడిగింది. " తగ్గడానికి ట్రై చేస్తున్నా.. నువ్వే నాకు ఆదర్శం.. ఎందుకంటే ఇప్పుడు నేను డైట్‌లో ఉన్నా.." అంటూ కొంచెం ఎక్కువగానే చెప్పాడు భోలే. తర్వాత తన సినిమా ప్రొడ్యూసర్ ని పరిచయం చేశాడు. "ఇతను పరిగి మల్లిక్ అన్నా.. ఆయన నిర్మాతగా నేను 'భోలే అంటే హీరో' అనే సినిమా చేస్తున్నా.. అన్న ఏం అంటున్నాడంటే భోలే.. ప్రియాంక హీరోయిన్‌గా చేస్తుందా అని అడగవా ఒకసారి అన్నాడు.. కానీ నేను కూడా కొంచెం మంచిగా తయారై అప్పుడు అడుగుదామన్నా.. ఎందుకంటే ఇప్పుడు నన్ను ప్రియాంక ఒప్పుకునేలా లేదు.." అంటూ భోలే కొంచెం కామెడీ చేసాడు. ఇక ఈ మూవీ రాబోతోంది అందరం చూసి సపోర్ట్ చేద్దాం అంటూ ప్రియాంక జైన్ కంక్లూడ్ చేసేసింది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.