English | Telugu

మానస్, ప్రాకృతి మధ్య గొడవ...


ఓంకార్ షో అంటే చాలు మసాలా కన్నా మానవతా విలువలు, జీవన నేపథ్యం, కొంచెం కన్నీళ్లు, కొంచెం ప్రేమ ఇలాంటి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. వీటితో పాటు సడెన్ గా డెసిషన్స్ తీసుకుంటూ కంటెంట్ క్రియేట్ చేయడంలో ఓంకార్ తర్వాతే ఎవరైనా..డాన్స్ ఐకాన్ 2 ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో అలా నామినేషన్స్ అని అనౌన్స్ చేసేసాడు. ఐతే అప్పుడే నామినేషన్స్ ఏంటన్నా అంటూ అందరూ షాకయ్యారు. అలాగే ఇద్దరు జడ్జెస్ మధ్య గొడవలు కూడా మొదలయైపోయాయి..

మానస్ అండ్ ప్రాకృతి మధ్యన గట్టిగానే వార్ జరిగింది. "డాన్స్ ఐకాన్ సీజన్ లో ఫస్ట్ ఎలిమినేషన్" అని ఓంకార్ చెప్పగానే " ఐ నామినేట్ ప్రాకృతి" అనేశాడు మానస్. "నేను కంటెస్టెంట్ ని నామినేట్ చెయ్యట్లేదు ప్రాకృతిని నామినేట్ చేస్తున్నా" అన్నాడు సీరియస్ గా. "ఇదేం రీజన్ అండి...టెక్నికాలిటీ తీసుకోవట్లేదు అంటున్నారు" అనేలోపు మానస్ కూడా అరిచేసాడు. దాంతో ప్రాకృతి కూడా ఫుల్ ఫైర్ అయ్యింది. "ఇది ఆ చిన్నారికి సంబందించిన పెర్ఫార్మెన్స్ నా నామినేషన్ కాదు" అని చెప్పింది. "ఇది నా నామినేషన్, ఇది నా విష్" అన్నాడు ముఖం చిట్లిస్తూ మానస్. "చూడండి ఇది డాన్స్" అని ప్రాకృతి చెప్పేటప్పుడు "నేను మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడనివ్వండి" అన్నాడు సీరియస్ గా. ఇంతకు ఇద్దరి మధ్య ఎందుకు ఏ టెన్నికాలిటీ విషయంలో గొడవయ్యిందో ఎపిసోడ్ లో తెలుస్తుంది. మానస్ అసలు ఎందుకు ఫైర్ అయ్యాడు ? అసలు నిజంగానే నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయా చూడాలి ఎం జరుగుతుందో.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.