English | Telugu

డాన్సర్ షోనాలి నడుముతో తనను పోల్చుకున్న...బ్రహ్మముడి కావ్య


డాన్స్ ఐకాన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఒక్కో కంటెస్టెంట్ డాన్స్ ఇరగదీస్తూ కనిపించారు. ఇక ఇందులో షోనాలి మాంద్యన్ చేసి పెర్ఫార్మెన్స్ స్టేజి మొత్తం వేడి సెగలు పుట్టించింది. సన్నని నడుముతో సెక్సీ ఫిగర్ తో ఉఫ్ అనుకునేలా పెర్ఫార్మ్ చేసింది. "గురు" మూవీలో మల్లికా శెరావత్ చేసిన "మయ్యా,మయ్యా" సాంగ్ కి ఇరగదీసేసింది. దీంతో బ్రహ్మముడి సీరియల్ కావ్య కుళ్లిపోయింది. సోనాలి నడుమును చూసి ఏడుపు మొదలుపెట్టింది కావ్య. దాంతో పక్కనే ఉన్న యష్ చూసి "నువ్వెందుకు ఏడుస్తున్నావ్" అన్నాడు. "నిన్ను, నీ పెర్ఫార్మెన్స్ చూస్తూ అందరూ హ్యాపీ అయ్యారు. కానీ నాకు మాత్రమే బాధొచ్చింది. ఎందుకో తెలుసా. నీలాంటి నడుము నాకు లేదని" అనేసరికి..ఇందిరా ఈ సన్నని నడుము గోల అనుకుంటూ అందరూ నవ్వుకున్నారు.

ఇక సోనాలి కూడా నవ్వుకుంది. బుల్లితెర మల్లికా శెరావత్ అని సోనాలిని పిలిచినా తప్పు లేదు. అలా చేసింది డాన్స్. ఇక సోనాలి గురించి ఓంకార్ చెప్తూ "రీసెంట్ గా పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాని రిప్రెజెంట్ చేస్తూ డాన్స్ పెర్ఫార్మ్ చేసింది" అని పరిచయం చేసాడు. ఇక డాన్స్ ఐకాన్ లో డాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళను, డాన్స్ ని సింక్ లో చేసేవాళ్లను పెట్టాడు కానీ నాన్ సింక్ తో అసలు డాన్స్ రాని దీపికను పెట్టడం కొంచెం ఆశ్చర్యమే అనిపించినా కూడా డాన్స్ తనకు నచ్చినట్టు చేస్తూ జడ్జ్మెంట్ ఇస్తూ తన కామెడీ మార్క్ టైమింగ్ తో అందరినీ అలరించే అవకాశం ఉంది కాబట్టి ఆమెకు స్పెషల్ ప్లేస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కావ్య మాత్రం తన కామెడీ మొదలెట్టేసింది. నడుము అంటూ స్టార్ట్ చేసింది ఇక ఈ షో కంప్లీట్ ఎండింగ్ వరకు ఎంత కామెడీని పంచుతుందో చూడాలి.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.