English | Telugu

రామలక్ష్మిని వెతుకుతూ వెళ్ళిన సీతాకాంత్.. సవతి తల్లి చూస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -335 లో..... రామలక్ష్మి బీరువా నుండి తాళిని తీసి చూస్తూ బాధపడుతుంది. నేను లేకపోతే ఏమవుతారో అనుకున్నాను.. నన్ను మర్చిపోయి పెళ్లి చేసుకున్నారని రామలక్ష్మి బాధపడుతుంది. కానీ ఒకరకంగా సంతోషంగా ఉంది. మీరు హ్యాపీగా ఉండి మీకంటూ ఒక కుటుంబం ఏర్పర్చుకున్నారు.. ఇక మీదట ఎప్పటికి నేను మైథిలీగానే ఉంటానని రామలక్ష్మి అనుకుంటుంది.

సీతాకాంత్ రామ్ ని తన గుండెల పై పడుకోబెట్టుకొని రామలక్ష్మి గురించి ఆలోచిస్తాడు. ముందు రామ్ కి రామలక్ష్మి పై ఉన్న ఇంప్రెషన్ పోగొట్టాలి.. అప్పుడే మనం రామలక్ష్మి విషయంలో ముందుకు వెళ్ళగలమని అనుకుంటాడు. రామ్ కి రామలక్ష్మి గురించి సీతాకాంత్ మంచిగా చెప్పే ప్రయత్నం చేయగా.. రామ్ వినిపించుకోడు. దాంతో ఈ ప్రయత్నం కంటే రామలక్ష్మిని తన నోటితో రామలక్ష్మి అని చెప్పేలా చెయ్యాలని సీతాకాంత్ అనుకుంటాడు. మరుసటి రోజు మైథిలి ఆఫీస్ కి సీతాకాంత్ వెళ్లి తన గురించి తెలుసుకుంటాడు. ఇంకా తన ఇంటిముందుకి వెళ్లి అక్కడ పని చేసే అతన్ని అడుగుతాడు. తను మా మైథిలి మేడం.. ఇన్ని రోజులు లండన్ లో ఉండి, ఇప్పుడే వచ్చి ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటుందని చెప్తారు. అందరు మైథిలీ అంటున్నారు. మరి నాకెందుకు రామలక్ష్మి అనిపిస్తుందని సీతాకాంత్ అనుకుంటాడు.

ఆ తర్వాత రామ్ ని సీతాకాంత్ స్కూల్ కి తీసుకొని వెళ్ళాలనుకుంటాడు. వద్దని రామ్ అంటాడు. దాంతో మేం తీసుకొని వెళ్తామని శ్రీవల్లి, శ్రీలత లు రామ్ ని స్కూల్ కి తీసుకొని వెళ్తారు. రామ్ క్లాస్ కి వెళ్ళాక రామలక్ష్మి పై రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాస్టిక్ బల్లితో పాటు ఫ్లోర్ పై ఆయిల్ పోస్తాడు. మరొకవైపు రామ్ క్లాస్ అయిపోయేంత వరకు శ్రీవల్ల, శ్రీలత లు బయట వెయిట్ చేస్తుంటారు. సీతాకాంత్ రామాలక్ష్మిని చూడడానికి స్కూల్ కి వస్తాడు. అక్కడ సీతాకాంత్ ని శ్రీవల్లి చూసి శ్రీలతకి చెప్తుంది. ఎందుకు వచ్చినట్లు వెనకాలే వెళ్తే తెలుస్తుందని ఇద్దరు అనుకుంటారు. రామలక్ష్మి కోసం సీతాకాంత్ వెతుకుతు ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.