English | Telugu
కళ్యాణ్ కోసం అర్థరాత్రి ప్రేమ వెతుకులాట.. చెంపచెల్లుమనిపించిన భర్త!
Updated : Feb 22, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -89 లో..... ప్రేమ కన్పించకపోవడంతో భద్రవతి ఇంటికి వేదవతి వెళ్లి వెతుకుతుంది. నా కోడలిని తీసుకొని వచ్చి ఏం చేశారు.. నా కోడలిని నా ఇంటికి తీసుకొని వచ్చి అప్పగించాలంటూ భద్రవతికి వేదవతి వార్నింగ్ ఇస్తుంది. ప్రేమ కన్పించకపోవడం ఏంటని భద్రవతి షాక్ అవుతుంది. రెండు కుటుంబాల గొడవలకి కారణం అవుతున్నానంటూ ఎక్కడికో వెళ్ళిపోయినట్లుందని పెద్దావిడ అంటుంది.
మీ గొడవలకి నా కూతురిని బలి చేస్తారా అని రేవతి బాధపడుతుంది. అందరు ప్రేమని వెతకడానికి వెళ్తారు. మరొకవైపు కళ్యాణ్ గురించి ప్రేమ వెతుక్కుంటూ ఉంటుంది. తన ఫ్రెండ్ కోమలి హెల్ప్ తీసుకొని కళ్యాణ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి తన గురించి అడుగుతుంది. కళ్యాణ్ రామచంద్రపురంలో ఉన్నాడంట అని కళ్యాణ్ ఫ్రెండ్ ప్రేమకి చెప్తాడు. అక్కడికి ప్రేమ వెళ్ళాలనుకుంటుంది. ఆ తర్వాత రాత్రి సాగర్, చందు, సేనాపతి, విశ్వలు ఇంటికి ప్రేమ కన్పించలేదని నిరాశగా వస్తారు. ధీరజ్ వస్తుంటే ప్రేమ కోమలిలు ఆటో ఎక్కుతు కన్పిస్తారు. ధీరజ్ వెళ్లి ప్రేమ చెంప చెల్లుమనిపిస్తాడు.. ఎంత సేపటి నుండి వెతుకుతన్నామంటూ కోప్పడతాడు. ప్రేమ కూడా ధీరజ్ చెంప చెల్లుమనిపిస్తుంది. కళ్యాణ్ గాడు నగలు తీసుకొని వెళ్తుంటే నీకే కదా కన్పించింది. మరి ఎందుకు పట్టుకోలేదని ప్రేమ కోప్పడుతుంది.
బండి ఎక్కు వెళదామని ధీరజ్ అంటుంటే.. రానని ప్రేమ మొండిగా ఉంటుంది. దాంతో ధీరజ్ వెళ్ళపోతాడు. ప్రేమ చీకట్లో భయపడుతుంది. మళ్ళీ ధీరజ్ వచ్చి ప్రేమని బైక్ ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు. ఇందాక బయపెట్టింది నేనే అని ధీరజ్ అనగానే సచ్చినోడా అంటూ ప్రేమ ధీరజ్ ని తిడుతుంది. తరువాయి భాగంలో ప్రేమ, దీరజ్ లు కలిసి కళ్యాణ్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అలసిపోయి ధీరజ్ భుజాలపై ప్రేమ పడుకొని ఉంటుంది. ధీరజ్ కూడా పడుకుంటాడు. తెల్లవారే సరికి అలాగే పడుకొని ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ తమ చుట్టూ చేరతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.