English | Telugu

దీపికా టాలెంట్ అది మరి.. డాన్స్ రాకపోయినా డాన్స్ షోకి మెంటార్ అయ్యింది

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోకి చిన్ని వెర్సెస్ బ్రహ్మముడి సీరియల్స్ వాళ్ళు వచ్చారు. ఐతే చిన్నిని చూసిన శ్రీముఖి "అమ్మా అని పిలిపించుకోవడానికి నీకు ఎవరూ లేరు..ఎవరూ రారు" అని బాధపడుతూ చెప్పింది. ఇంతలో బ్రహ్మముడి కావ్య నేను ఉన్నాను అంటూ వచ్చేసింది. అలా ఈమె గురించి అవినాష్ , హరి మధ్య మాటల యుద్ధం జరిగింది. "ఐనా కొత్త సంవత్సరంలో నీ పెత్తనమేంటి" అని అవినాష్ అడిగాడు.

"ఐనా నీకు దీపికా గురించి ఎం తెలుసు...ఒక్క డాన్స్ స్టెప్ రాకపోయినా ఒక డాన్స్ షోకి మెంటార్ అయ్యింది" అని హరి దీపికా గురించి అవినాష్ కి అర్థమయ్యేలా చెప్పాడు. తర్వాత దీపికా "ఈ చిన్నిని నేను తీసుకెళ్తాను" అంది. "హలో అలా ఎలా తీసుకెళ్తారు..నేను ఆమె టీచరమ్మను..తాను నా ఫామిలీ" అంటూ కావ్య గట్టిగా చెప్పింది. ఇక దీపికను- మానస్ ని పిలిచి "బుజ్జితల్లి" అంటూ ఒకసారి పిలువు అంటుంది శ్రీముఖి. "ఆయన బుజ్జితల్లి కాదు పిచ్చితల్లి" అని పిలుస్తాడు అని చెప్పింది దీపికా. ఇక దీపికా డాన్స్ ఐకాన్ సీజన్ 2 షోలో విపుల్ అనే డాన్సర్ కి మెంటార్ గా చేస్తోంది. ఎప్పటిలాగే ఆ షోలో కూడా నవ్వులు పండిస్తోంది దీపికా. ఇప్పుడు ఎక్కడ చూసినా టైమింగ్ ఉన్న కామేడీ చేయడం నవ్వించడం వంటివి చేస్తోంది. ఏ షో చూసినా దీపికనే కనిపిస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.