English | Telugu

Eto Vellipoyindhi Manasu : అమ్మని గుర్తు చేసుకొని రామ్ ఎమోషనల్.. తనని స్కూల్ కి పిలిపించిన రామలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -340 లో.... రామలక్ష్మి క్లాస్ చెప్తుంటే రామ్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. రామలక్ష్మికి ఏం చెయ్యాలో అర్ధం కాదు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. రామ్ అలా చెప్తే వినడు అంటూ ఎలా చెప్తే వింటాడో సీతాకాంత్ చెప్తాడు. రామ్ ఇప్పుడు మనం గేమ్ ఆడుదామా అని రామలక్ష్మి అంటుంది. దాంతో రామ్ సరదాపడుతూ ఆడుదామని అంటాడు. దాంతో రామలక్ష్మి, సీతాకాంత్, రామ్ లు దాగుడుమూతలు ఆడుతారు. రామలక్ష్మి సీతాకాంత్ లు దగ్గరగా వచ్చి తమ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు.

నువు నా రామలక్ష్మివి అని సీతాకాంత్ అనగానే.. లేదు నేను మైథిలి ని అని రామలక్ష్మి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు సుశీల, ఫణీంద్ర లు మైథిలి ఫోటో చూస్తూ బాధపడతారు. ఈ బాధని పోగొట్టడానికే రామలక్ష్మి రూపం లో మన మైథిలి మన దగ్గరికి వచ్చింది అని ఫణీంద్ర అంటాడు. పాపం తన భర్త తన ముందున్నా చెప్పుకోలేని పరిస్థితి అని రామలక్ష్మి గురించి సుశీల బాధపడుతుంటే అదంతా రామలక్ష్మి చూస్తుంది. ఒకవైపు రామలక్ష్మి మరొకవైపు సీతాకాంత్ లు చందమామని చూస్తూ మాట్లాడుకుంటారు.

మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి రామ్ కి క్లాస్ చెప్తుంది. రామలక్ష్మిని ఇంప్రెస్ చేసేలా సేమ్ సీతాకాంత్ లాగా మాట్లాడుతాడు రామ్. సేమ్ మీ నాన్న లాగే మాట్లాడుతున్నావంటు రామ్ ని హగ్ చేసుకుంటుంది రామలక్ష్మి. రామ్ ఎమోషనల్ అవుతూ నేను మా మామ్ ని చాలా మిస్ అవుతున్నానని అనగానే.. అంటే వీళ్ళ అమ్మ రామ్ తో సరిగా ఉండడం లేదా తన సంగతి చెప్తాననుకోని రోషన్ వాళ్ల అమ్మ మమతని స్కూల్ కి పిలిపించి మాట్లాడుతుంది. రామ్ చాలా బాధపడుతున్నాడని రామలక్ష్మి అనగానే రోషన్ ట్రాన్స్‌ఫర్ అవుతున్నాడని బాధపడుతున్నాడని మమత అనుకుటుంది. రామలక్ష్మి అసలు సంబంధం లేకుండా మాట్లాడేసరికి మమతకి ఏం అర్ధం కాదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.