English | Telugu

డాన్స్ ఐకాన్ కి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్

డాన్స్ ఐకాన్ సీజన్ 2 మంచి రేటింగ్ తో బాగా సాగుతోంది డాన్స్ ఎపిసోడ్. ఇక ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా మెంటార్ జాములూరి ఆమె కంటెస్టెంట్ షోనాలి ఇద్దరూ ఎలిమినేట్ ఇపోయారు. సోనాలికి బ్రౌన్ స్టార్ వచ్చినా కూడా ఎలిమినేట్ అయ్యింది..అంటే పంచ భూతాలుగా ఇక్కడ మెంటార్స్ ని రిప్రెజెంట్ చేసాడు యాంకర్ ఓంకార్. అంటే ఇప్పుడు జాను లూరి వాళ్ళు "వాటర్" ని రిప్రెజెంట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి వీళ్ళ ప్లేస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా కొత్త పెయిర్ ని తీసుకొచ్చారు. నెక్స్ట్ వీక్ ప్రోమోలో ఈ కొత్త జంటను చూపించారు. వాళ్ళు ఎవరో కాదు బుల్లితెర మీద సీరియల్స్ లో కనిపించే, బిగ్ బాస్ సీజన్ 7 కి వెళ్లిన ప్రియాంక జైన్ . ఇక ప్రియాంక జైన్ గురించి చెప్పక్కర్లేదు బుల్లితెర మీద "మౌనరాగం" సీరియల్‌లో తన హవభావాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది అమ్ములు అలియాస్ ప్రియాంక జైన్.. మాటలు రాని మూగ అమ్మాయి పాత్రలో జీవించేసి ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. కన్నడలో రూపొందించిన ‘రంగి తరంగి’ ఈమె మొదటి సినిమా. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ప్రియాంక జైన్, తెలుగులో గోలిసోడా, చల్తే చల్తే, వినరా సోదరా వీరకుమారా, ఎవడూ తక్కువ కాదు లాంటి సినిమాల్లో నటించింది. బుల్లితెర మీద జానకి కలగనలేదు సీరియల్ లో నటించింది. ఇక ఇప్పుడు డాన్స్ ఐకాన్ కి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చేసింది మరి ఎలా చేస్తుందో చూడాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.