English | Telugu

శ్రీముఖి ఇంట్లో వండిపెట్టేది...నేను తినేదాన్ని

తమన్నా సింహాద్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీముఖికి బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు చూసిన తమన్నా సింహాద్రి శ్రీముఖి ఇంట్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఎక్కడికి వెళ్లినా కూడా శ్రీముఖి, అవినాష్, తమన్నాసింహాద్రి వీళ్ళే ఎక్కువగా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ ని కూడా శ్రీముఖి ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అవినాష్ కానీ తమన్నా కానీ శ్రీముఖి ఇంటికి వెళ్ళినప్పుడల్లా తానె ఇంట్లో వంట చేసి పెడుతూ ఉంటుంది. ఆ వీడియోస్ ని, రీల్స్ ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు తమన్నా సింహాద్రి తెగ ఫీలైపోతోంది. అమ్మా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ అమ్మే చేసిపెట్టేది..కాబట్టి ఎలాంటి శ్రమ ఉండేది కాదు. కానీ ఇప్పుడు తాను వంట చేసుకోవాలంటే చాలా బాధగా ఉందని చెప్పింది.

ప్రస్తుతం అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తోంది.. త్వరలో కెరీర్ మీద ఫోకస్

బుల్లితెర మీద బ్రహ్మముడి మానస్ చాలా ఫేమస్. మానస్ సీరియల్స్ లో నటిస్తూ ఉంటాడు. అలాగే ఈవెంట్స్ లో ఇంకా రకరకాల ఆల్బమ్స్ లో కనిపిస్తూ ఉంటాడు. కోయిలమ్మ, మానసిచ్చి చూడు వంటి సీరియల్స్ తో పేరు తెచ్చుకున్నాడు అలాగే నీతోనే డాన్స్ 2 .0  లో కూడా ఫైనల్స్ వరకు వెళ్ళాడు. ఇప్పుడు డాన్స్ ఐకాన్ లో సాధ్వి అనే డాన్సర్ కి మెంటార్ గా ఉన్నాడు. అలాగే విష్ణుప్రియతో కలిసి కొన్ని డాన్స్ ఆల్బమ్స్ కూడా చేసాడు. ఐతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. 'విష్ణుప్రియకు, నాకు అలా సెట్ ఐపోయింది. జరీ జరీ పంచె కట్టు సాంగ్ చేసాం . అది 70 మిలియన్ వ్యూస్ వెళ్లాయి. తర్వాత వచ్చిన గంగులు ఆల్బం సాంగ్ కూడా బాగా హిట్ అయ్యింది. "మా కాంబినేషన్ అలా హిట్ అయ్యింది. వేరే ఏదొచ్చినా చేస్తాం" అని చెప్పాడు మానస్. విష్ణు ప్రియా ఏదైనా చేయగలదు. ఆమె ఎంత ప్యాషనేట్ పర్సన్ అనేది బిగ్ బాస్ షో ద్వారా ఆడియన్స్ కి కూడా బాగా తెలిసి వచ్చింది. ఇక మా అబ్బాయి ఆరు నెలల పిల్లాడు.

Illu illalu pillalu : కోడలి నిర్ణయాన్ని మెచ్చుకున్న వేదవతి.. రామరాజుపై భద్రవతి ఫైర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -104 లో.....ప్రేమ ధీరజ్ లు అసలు ఎమన్నా తిన్నారో లేదోనని పాలు తీసుకొని వచ్చి ధీరజ్ కి ఇస్తుంది వేదవతి. కానీ వేదవతితో ధీరజ్ మాట్లాడడానికి ఇష్టపడడు. మీరు మాట్లాడకపోయిన పర్వాలేదు కానీ ఆ పాలు అయినా తాగండి అంటూ వేదవతి బాధపడుతూ వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ లేదు దూరం ఉంది.. సఖ్యత లేదని వేదవతి బాధపడుతుంది. అప్పుడే నర్మద, సాగర్ లు వేరువేరుగా పడుకోవడం చూసి వీళ్ళకి ఏమైందని వేదవతి అనుకుంటుంది.

పెళ్లి చూపులకు వేదికైన సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ స్టేజి

సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ నెక్స్ట్ వీక్ ప్రోమో వేరే లెవెల్ లో ఉంది. ఇక ఇందులో చాలా సీరియల్స్ నటీనటులు పోటీ పడుతూ ఉన్నారు. జీ తెలుగు సీరియల్స్ దేనికదే సాటి అని చెప్పొచ్చు. ఇక అన్ని సీరియల్స్ లోకి మేఘ సందేశం సీరియల్ మాత్రం టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఎందుకంటే ఈ సీరియల్ జోడి అందరికీ ఇష్టమైన జోడి గగన్ - భూమి. ఇప్పుడు ఈ సీరియల్ జోడి సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వీళ్ళతో స్పెషల్ గా రిలీజయిన ఈ ప్రోమో ఇప్పుడు ఆడియన్స్ మనసులను దోచుకుంటోంది. ఒకసారి ఈ ప్రోమో చూస్తే ..పెళ్లి చూపాలకు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఎదురెదురుగా కూర్చోబెట్టారు. భూమి తెగ సిగ్గుపడిపోతూ తలదించుకుంది.

Eto Vellipoyindhi Manasu : రౌడీల నుండి రామలక్ష్మిని కాపాడిన సీతాకాంత్.. ఫణీంద్ర నిజం చెప్పాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో......రామలక్ష్మి సీతాకాంత్ గదిలో తన ఫోటో చూస్తుంది. అక్కడ పేపర్ పై తనపై ఉన్నా ప్రేమని సీతాకాంత్ రాస్తాడు. అది చూసి రామలక్ష్మి ఎమోషనల్ అవుతుంది. మిమ్మల్ని తప్పుగా అపార్ధం చేసుకున్నానని ఏడుస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఎవరికి చెప్పకుండా అమ్మవారి దగ్గరికి వెళ్లి తన బాధని చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతుంది. మైథిలి మేడమ్ ఉన్నట్టు ఉండి ఎక్కడికి వెళ్ళింది అని సీతాకాంత్, రామ్ లు అనుకుంటారు.

Brahmamudi : యామిని హ్యాపీ.. భర్త బ్రతికే ఉన్నాడని చెప్తూ కావ్య పూజలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -666 లో..... డాక్టర్ వచ్చి రాజ్ గతం మర్చిపోయాడని చెప్పగానే యామిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా రాజ్ నా కోసం మళ్ళీ పుట్టాడని యామిని అంటుంది. మరొకవైపు రాజ్ షర్ట్ పట్టుకొని అపర్ణ ఏడుస్తుంటుంది. కావ్య మాటలు విని నాకు నమ్మకం ఉంది రాజ్ బ్రతికే ఉన్నాడని ఇందిరాదేవి అంటుంది. కళ్యాణ్ అక్కడికి వెళ్ళినప్పటి నుండి ఎందుకు డల్ గా ఉన్నాడని ధాన్యలక్ష్మి అంటుంది. అసలేం జరిగింది ఏవైనా చెప్పేది మిగిలి ఉందా అని అపర్ణ అంటుంది. దాంతో చెప్పడానికి కళ్యాణ్ ఇబ్బంది పడతాడు.

Illu illalu pillalu : జాబ్ కోసం ధీరజ్ కసరత్తులు.. ప్రేమని వెయిటర్ గా చూసి షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -102 లో....ధీరజ్ జాబ్ కోసం ట్రై చేస్తుంటాడు. వెళ్ళిన చోటల్లా నిరాశ ఎదరవుతుంది. మరొకవైపు మీ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయని రామరాజు భాగ్యం వాళ్ళని అడుగుతాడు. ఎక్కడ జనాలు ఉంటే అక్కడే ఇడ్లీ, దోశ అని భాగ్యం భర్త అంటాడు. మీరేం అంటున్నారో నాకూ అర్థం కావడం లేదని రామరాజు అంటాడు. అదేం లేదండి.. మేం ఫైనాన్స్ ఇస్తాం కదా చిన్న వ్యాపారస్తులకి కూడా ఇస్తుంటామని, వాళ్ల వ్యాపారాల దగ్గరికి వెళ్లి అక్కడే ఫైనాన్స్ ఇస్తామని భాగ్యం చెప్తుంది. ఇంకా రెండు ఇల్లులు ఉన్నాయన్నారు కదా ఎక్కడ అని రామరాజు అడుగుతాడు. ఉన్నాయ్ అండి.. వాటి గురించి చెప్పొద్దూ గోడలకి చెవులు ఉంటాయి. విని అధికారులకి చెప్తే చెకింగ్ కి వస్తారని భాగ్యం అంటుంది. లోపల లాకర్ లో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి వీళ్లకి చూపించండి అని తన భర్తకి భాగ్యం చెప్తుంది. అతను వెళ్ళబోతుంటే ఆపి, ఎందుకవన్నీ అవసరం లేదని రామరాజు అంటాడు. ఆ తర్వాత చందు, శ్రీవల్లిలు ఫోన్ నెంబర్ మార్చుకుంటారు.