English | Telugu

దీపని చంపాలనుకున్న జ్యోత్స్న.. చూసేసిన శౌర్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియస్ శనివారం నాటి ఎపిసోడ్ -294 లో....దీపనే తన ప్రాణధాత అని తెలుసుకున్న కార్తీక్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయ్. దీప చిన్నప్పటి ఫోటోని బీరువా లో పెట్టి ఇప్పుడే వెళ్లి దీపని కలవాలని వెళ్తాడు. శౌర్యని దీప స్కూల్ నుండి ఇంటికి తీసుకొని వస్తుంటుంది. ఇప్పుడు జ్యోత్స్న వచ్చిన కూడా తనతో వెళ్లొద్దంటు శౌర్యకి దీప చెప్తుంది. నేను చాక్లెట్ తెచ్చుకుంటా నువ్వు ఇక్కడే ఉండాలని దీపకి శౌర్య చెప్పి వెళ్తుంది.

అప్పుడే దీప దగ్గరికి ఒకతను వచ్చి ఈ అడ్రెస్ ఎక్కడ అంటూ అడుగుతాడు. అతను వెనకాలున్న రౌడీకి సైగ చెయ్యడం దీప చూస్తుంది. రౌడీ కత్తితో దీప పై దాడి చేయబోతుంటే అప్పుడే దీప గమనించి అతన్ని ఆపి వాళ్ళని కొడుతుంది. శౌర్య వస్తుంటే దీప చూసి.. శౌర్య పరిగెత్తు అనగానే అక్కడి నుండి తను పరిగెడుతుంది. ఇక అదే సమయంలో దీప వెనకాల నుండి జ్యోత్స్న వచ్చి తన ముక్కు దగ్గర మత్తు చూపిస్తుంది. దాంతో దీప స్పృహ కోల్పోతుంది. అదంతా దూరం నుండి శౌర్య చూస్తుంది.శౌర్య వెంబడి రౌడీలు పరిగెత్తుతారు. మరొకవైపు జ్యోత్స్నలో చాల మార్పు వచ్చింది గదిలో రెస్ట్ తీసుకుంటుందని దశరథ్ కి సుమిత్ర చెప్తుంది. జ్యోత్స్న అలా ఉంటుందంటే డౌట్ పడాలని దశరత్ అనుకుంటాడు.

మరొకవైపు రౌడీ లని పంపించి తనే గన్ తో దీప ని షూట్ చెయ్యాలనుకుంటుంది‌ జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ అటుగా వస్తుంటాడు. దాంతో పక్కకి వెళ్లి దాక్కుంటుంది. కార్తీక్ శౌర్య బ్యాగ్, దీప చెప్పులు చూసి కంగారు పడుతాడు. అక్కడ దీప పక్కకి పడిపోయి ఉంటుంది. తనని లేపుతాడు. శౌర్యని కాపాడండి అని దీప అంటుంది. దాంతో శౌర్య కోసం కార్తీక్ వెళ్తాడు. శౌర్య షూస్ చైన్ కన్పిస్తాయి దాని ఆధారంగా కార్తీక్ వెళ్తాడు. శౌర్యా ఒక దగ్గర దాక్కొని ఉంటుంది. జ్యోత్స్న మా అమ్మని ఎందుకు అలా చేసిందని శౌర్య అనుకుంటుంది. రౌడీలు శౌర్యని చూస్తారు. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.