తమన్నాతో పులిహోర కలిపిన ఇమ్ము
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 1 మంచి హాట్ ఫైటింగ్స్ తో సరదాసరదా టాస్కులతో ఎండ్ ఐపోయింది. ఇక ఇప్పుడు సీజన్ 2 వచ్చేసింది. ఈ షో 29 వ శనివారం నాడు లాంచ్ కాబోతోంది. ఆ గ్రాండ్ లాంచ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షో ఇక ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారం కాబోతోంది. ఇక ఈ షోకి హోస్ట్ గా శ్రీముఖి ఇక జడ్జెస్ కం మెంటార్స్ గా శేఖర్ మాస్టర్, అనసూయ వచ్చారు. అలాగే కంటెస్టెంట్స్ గా రోహిణి, డెబ్జానీ, పృద్వి శెట్టి, శ్రీ సత్య, బ్రహ్మముడి మానస్, తేజస్విని మాదివాడ, ఇమ్మానుయేల్, నిఖిల్ విజయేంద్ర సింహ, బబ్లు ఇంకా కొంతమంది సీరియల్ నటీనటులు వచ్చారు. ఐతే ఈ లాంచ్ ఎపిసోడ్ కి మిల్కీ బ్యూటీ తమన్నా వచ్చింది. ఇమ్ము ఏమంటూ ఈటీవీ నుంచి స్టార్ మాకి వచ్చాడో ఇక వచ్చే గెస్టులందరితో కూడా ఫన్ క్రియేట్ చేసే పని పెట్టుకున్నాడు. ఈ షోలో కూడా మిల్కీ బ్యూటీ తమన్నాతోనే పులిహార కలిపాడు.