English | Telugu

తమన్నాతో పులిహోర కలిపిన ఇమ్ము

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 1 మంచి హాట్ ఫైటింగ్స్ తో సరదాసరదా టాస్కులతో ఎండ్ ఐపోయింది. ఇక ఇప్పుడు సీజన్ 2 వచ్చేసింది. ఈ షో 29 వ శనివారం నాడు లాంచ్ కాబోతోంది. ఆ గ్రాండ్ లాంచ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షో ఇక ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారం కాబోతోంది. ఇక ఈ షోకి హోస్ట్ గా శ్రీముఖి ఇక జడ్జెస్ కం మెంటార్స్ గా శేఖర్ మాస్టర్, అనసూయ వచ్చారు. అలాగే కంటెస్టెంట్స్ గా రోహిణి, డెబ్జానీ, పృద్వి శెట్టి, శ్రీ సత్య, బ్రహ్మముడి మానస్, తేజస్విని మాదివాడ, ఇమ్మానుయేల్, నిఖిల్ విజయేంద్ర సింహ, బబ్లు ఇంకా కొంతమంది సీరియల్ నటీనటులు వచ్చారు. ఐతే ఈ లాంచ్ ఎపిసోడ్ కి మిల్కీ బ్యూటీ తమన్నా వచ్చింది. ఇమ్ము ఏమంటూ ఈటీవీ నుంచి స్టార్ మాకి వచ్చాడో ఇక వచ్చే గెస్టులందరితో కూడా ఫన్ క్రియేట్ చేసే పని పెట్టుకున్నాడు. ఈ షోలో కూడా మిల్కీ బ్యూటీ తమన్నాతోనే పులిహార కలిపాడు.

తమన్నా రావడంతోనే రెబెల్ మూవీ నుంచి "దందం నకనక" సాంగ్ కి డాన్స్ చేస్తూ వచ్చింది. శ్రీముఖి ఐతే "మీరు కావాలయ్యా..మీరు రావాలయ్యా రా రా " అంటూ పాట పాడింది. తర్వాత ఇమ్ము రెడ్ రోజ్ తీసుకుని మిల్కీ బ్యూటీ ముందుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని "ఎందుకంటే ప్రేమంట" మూవీలోని హిట్ సాంగ్ "నీ చూపులే నా ఊపిరి..ఓ సారిలా చూడే చెలి" అంటూ పాటను మాటలుగా చెప్పాడు. "పాట పాడేస్తున్నావా నువ్వు" అంది అనసూయ. తర్వాత ఇమ్ము లేచి "ఆ సినిమాలో లా చంపేస్తారేరా నన్ను" అనేసరికి తమన్నా "నేను అందులో దెయ్యాన్ని అని చెప్పింది" "కానీ మీరు నాకు దేవతలాగే కనిపిస్తున్నారు " అని కొంచెం పులిహోర కలిపాడు. ప్రోమో ఫైనల్ లో కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 అంటూ ఈ షో పేరు చెప్పేసింది తమన్నా.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.