English | Telugu

Eto Vellipoyindhi Manasu : రమ్య భాగోతం బయటపడింది.. సవతి తల్లి తనని తప్పించగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -360 లో..... రమ్యకి నగలు సెలక్ట్ చేస్తుంది. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ మైథిలి వస్తుందని శ్రీలత అంటుంది. రేపు జరిగే ఎంగేజ్ మెంట్ ఆపడానికి ఇప్పుడే వస్తుందేమోనని శ్రీవల్లి అంటుంది. ఎందుకు వచ్చావని రామలక్ష్మిని శ్రీవల్లి అడుగుతుంది. ఈ రోజు రాత్రి కి లండన్ వెళ్లిపోతున్నా ఒకసారి బాబుని కలిసివెళ్లాడానికి వచ్చానని రామలక్ష్మి అంటుంది. అప్పుడే రామ్ రామలక్ష్మి దగ్గరికి వచ్చి.. మిస్ మా ఫ్రెండ్ కాల్ చేసాడని మాట్లాడి వస్తానని చెప్పి బయటకు వెళ్తాడు.

కన్నీళ్లు పెట్టుకున్న లేడీ ఆటో డ్రైవర్స్...ఆటో డ్రైవర్ కాన్సెప్ట్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ ఎమోషనల్ గా ఉంది. ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ అంతా కూడా ఆటో డ్రైవర్ థీమ్ తో రాబోతోంది. ఐతే ఈ ఎపిసోడ్ కి యాంకర్ రవి వచ్చాడు. ఐతే రవిని చూసిన నూకరాజు "ఏ మీటర్ లేకుండా నువ్వు రావు కదా" అనేసరికి "ఆటో డ్రైవర్ లు పడే కష్టాలను ఆడియన్స్ కి చూపించడం కోసం నేను వచ్చాను" అని చెప్పాడు రవి. అంటే ఎపిసోడ్ మొత్తం కూడా ఆటో డ్రైవర్ ల కష్టాలు, డాన్స్, పెర్ఫార్మెన్స్, స్కిట్స్ , సింగింగ్, ఎమోషన్స్ అన్నీ కూడా ఇదే థీమ్ మీద జరిగింది. ఐతే తాగుబోతు రమేష్, పంచ్ ప్రసాద్ వచ్చి ఆటో మీద జోక్స్ వేశారు. "నా ఆటో మీద మంచి కొటేషన్స్ రాసినా ఎవరూ ఎక్కడం లేదు" అని తాగుబోతు రమేష్ అనడంతో..ఇంతకు ఎం రాసావు అని ప్రసాద్ అడిగాడు. "లోకంలో లేవు కాకులు...నా ఆటోకు లేవు బ్రేకులు" అని రాసినట్లు చెప్పాడు. బ్రేకులు లేని ఆటోలో ఎలా ఎక్కుతారు అంటూ ప్రసాద్ కౌంటర్ వేసాడు. ఇక ఈ షోకి రియల్ లైఫ్ లోని కొంతమంది లేడీ ఆటో డ్రైవర్స్ వచ్చారు.

ఫస్ట్ నైట్ ప్రాప్తిరస్తూ... ఐ లవ్ యు శ్రీముఖి

ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ ఆదివారం షో ఫుల్ జోష్ తో సాగింది. ఈ షోకి ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్ నుంచి రామరాజు ఫామిలీ, భద్రావతి ఫామిలీ వచ్చారు. ఇక రామరాజుకు సీరియల్ లో ముగ్గురు కొడుకులు ఉంటారు. చందు, సాగర్, ధీరజ్ వచ్చారు. ఐతే మీ పెద్దబ్బాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారు..నేను ఉన్నా చూడండి...మా జంటను ఒకసారి ఎలా ఉంటామో చెప్పండి అనేసరికి రామరాజు చందుని, శ్రీముఖిని పక్కపక్కన పెట్టి పిన్ని పక్కన నిలబడినట్టు ఉంది పక్కకు రా అనేశాడు. దానికి శ్రీముఖి గట్టిగా నవ్వేసింది. తర్వాత సాగర్ దగ్గరకు వెళ్ళింది శ్రీముఖి. వెంటనే సాగర్ శ్రీముఖి కాళ్లకు దణ్ణం పెట్టేసరికి "అయ్యో నేను మీకంటే చిన్నదాన్ని" అనేసింది. తర్వాత సాగర్ తన వైఫ్ అంటూ చూపించాడు. వెంటనే శ్రీముఖి వాళ్లకు బ్లేసింగ్స్ ఇచ్చి రామరాజు గారిని తాతయ్యను చేయాలి అంటూ చెప్పింది. వెంటనే సాగర్ దగ్గరకు రామరాజు వచ్చి "వాడికి పెళ్లయ్యింది కానీ ఇంకేం జరగలేదు. చందు పెళ్ళైతే కానీ సాగర్ ఫస్ట్ నైట్ జరగదు" అంటూ చెప్పుకొచ్చాడు. వెంటనే శ్రీముఖి పెళ్ళైపోతుందిలే .. ఫస్ట్ నైట్ ప్రాప్తిరస్తూ అంటూ వాళ్ళను దీవించింది. ఇక ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ చేస్తున్న ఆమని ఈ షోకి ఫస్ట్ టైం వచ్చింది.

ఇస్మార్ట్‌ జోడీ  జోడి 3 ఫినిష్...టైటిల్ విన్నర్ ప్రేరణ - శ్రీపద్

ఇస్మార్ట్‌ జోడీ  జోడి సీజన్ 3 గ్రాండ్ ఫినాలే పూర్తయ్యింది. ఇందులో రకరకాల టాస్కులు ఇచ్చి మరీ ట్విస్టులు ఇచ్చాడు యాంకర్ ఓంకార్. కూరగాయలు కట్ చేయించి వెయిట్ వేయించి కొంతమందిని ఎలిమినేట్ చేసాడు. ఇక ఫైనల్స్ కి శ్రీపద్ - ప్రేరణ, ఆదిరెడ్డి - కవిత వెళ్లారు. ఫైనల్ టాస్క్ లో ఆదిరెడ్డి జోడి ఓడిపోయింది. దాంతో శ్రీపద్ - ప్రేరణ జోడీ సీజన్ టైటిల్ గెలిచారు. ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆదిరెడ్డి - కవిత జోడి రన్నరప్ గా నిలిచారు. ఇక స్టేజి మీద ఆదిరెడ్డి ఇష్మార్ట్ జోడి మీద రివ్యూ చెప్పు అని ఓంకార్ అడిగేసరికి "వెరీ ట్రాన్స్పరెంట్ షో ఇది. ఈ షో చూడనివాళ్లే నెగటివ్ గా మాట్లాడతారు గాని లేదంటే ఎవరూ నెగటివ్ గా మాట్లాడరు..ఈ షోలో ఉన్న జంటల నుంచి చూసి ఏదో ఒక పాయింట్ ని జనాలంతా నేర్చుకుని ఉంటారు.

జీవన్ అన్నా..అదిరిపోయే రూత్ లెస్ విలన్ క్యారెక్టర్ చెయ్యి అన్నా...ఒక నెటిజన్ సలహా

నటుడు జీవన్ ఇంతకు ముందు ఎవరో తెలీదు కానీ ఇప్పుడు బుల్లితెర మీద అందరికీ తెలుసు. ఎందుకంటే సుమతో కలిసి చెఫ్ గా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే అనే షో చేస్తున్నాడు. అందులో గుండుతో కనిపిస్తూ రకరకాల వంటల టాస్కులు ఇస్తూ జోడీస్ చేసే వంటలు తింటూ వంకలు పెడుతూ టేస్టో మీటర్ లో మార్క్స్ వేస్తూ ఉంటాడు. అలాంటి జీవన్ లో చాలా కోణాలు ఉన్నాయి. మంచి వంటలు చేస్తాడు, కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేసే గుణం ఉన్నవాడు, మంచి కమెడియన్ అలాగే జిమ్ లో మంచి వర్కౌట్ చేస్తూ అందరినీ మెస్మోరైజ్ చేస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా జీవన్ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. అందులో జిమ్ లోకి వెళ్లి వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కనిపించాడు . ఇక నెటిజన్స్ ఐతే ఆ వీడియో చూసి షాకయ్యారు.

ఫైర్ ఐన మంచు మనోజ్.. ఒక అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసావ్ శివ 

"అనగనగా ఈ ఉగాదికి" అంటూ ఈటీవీలో త్వరలో ప్రసారం కాబోయే షో నెక్స్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో యాంకర్ శివకి ఇచ్చిపడేశాడు మంచు మనోజ్. ఆల్రెడీ యాంకర్ శివకి ఈరోజు ప్రాణగండం ఉంది అంటూ ఆది సెటైర్ వేసాడు. ఐతే శివ కూడా మనోజ్ అన్నా ఒక క్వశ్చన్ అన్నా అనేసరికి "ఏ రెండో క్వశ్చన్ కి నువ్వు ఉండవా" అని కౌంటర్ వేసాడు. ఆ తర్వాత మనోజ్ "కావాలని ప్లాన్ చేసుకుని వచ్చి అలా కాంట్రోవర్సిగా చెప్తారో ఏమో....మరి మీ తప్పులు కూడా బయట పెట్టాలిగా.. నువ్వెండేది పిఆర్సినే కదా.. అందులో ఒక అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసావ్ ..ఆ అమ్మాయి పేరు..." అంటూ మంచు మనోజ్ ఫుల్ ఫైర్ అయ్యాడు.

 బిగ్ బాస్ కి నాగార్జున అన్ ఫిట్..ఆయనకు ఇంగ్లీష్ రాదు..

బిగ్ బాస్ హోస్ట్ అనేది మేజర్ రోల్...హోస్ట్ కి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. హోస్ట్ రోస్ట్ చేయొచ్చు కానీ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా రోస్ట్ చేయకూడదు అంటూ బిగ్ బాస్ హోస్ట్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున మీద బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా ఆకుల ఫైర్ అయ్యింది. "నాకు తెలిసి రానా గారు హోస్ట్ ఐతే బాగుంటుంది అనుకుంటున్నా. అతనొక ట్రెండీ పర్సన్. ఫామిలీ రిలేషన్స్, ఫ్రెండ్ షిప్స్ గురించి అప్డేట్ గా ఉండే వ్యక్తి. మళ్ళీ నాగార్జున గారే హోస్ట్ గా వస్తే నేను బిగ్ బాస్ కి వెళ్ళను..బిగ్ బాస్ హౌస్ లో అంత సీన్ లేకపోయినా గౌతమ్ మీద నాగార్జున గారు మండిపడ్డారు. కానీ రానా కొంచెం ఆలోచించి కామెంట్ చేసే పర్సన్ అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చేసిన నంబర్ వన్ యారి వంటి షోస్ చూస్తే ఆయన పర్సెప్షన్స్ చాలా బాగుంటాయి, క్లారిటీగా ఉంటాయి. 20 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క బిగ్ బాస్ తో వచ్చింది. ప్రజలతో కనెక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. కానీ నాగ్ సర్ వస్తే బిగ్ బాస్ హౌస్ కి మళ్ళీ అవకాశం వచ్చినా వెళ్ళను.