English | Telugu
ఫుడ్ బిజినెస్ లోకి బిగ్ బాస్ విన్నర్...బొక్కా..వీళ్ళు హీరోలేంటి ?
Updated : Mar 26, 2025
బుల్లితెర మీద ఉండే నటీనటులు కావొచ్చు ఆర్జెలు, విజేలు అందరూ కూడా ఒక పక్కన సీరియల్స్ లో నటిస్తూ, షోస్ చేస్తూ అలాగే మరో వైపు ఫుడ్ బిజినెస్ పెట్టి అందులో కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. జబర్దస్త్ లో కమెడియన్ గా చేసిన ఆర్పి నెల్లూరు చేపల పులుసు పేరుతో బిజినెస్ తెరిచాడు.. అలాగే బిగ్ బాస్ కి వెళ్లిన ఆదిరెడ్డి సలోన్ బిజినెస్ లోకి వెళ్ళాడు, లోబో టాటూ బిజినెస్ లో ఉండగా.. రీసెంట్ గా సోహైల్ కూడా ఫుడ్ బిజినెస్ లోకి వచ్చాడు. ఇప్పుడు విజె సన్నీ కూడా ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
కృష్ణగారు లో "అమృతం" పేరుతో ఓపెన్ చేసాడు. "ఆకలితో రండి..సంతోషంగా వెళ్ళండి" అని టాగ్ లైన్ పెట్టాడు. ఈ బిజినెస్ ఓపెనింగ్ కి చాలామంది వచ్చారు. ఐతే ఈ టైంలో సన్నీ కొన్ని విషయాలు చెప్పి బాధపడ్డాడు. "బిగ్ బాస్ నుంచి వచ్చాక చాలామంది కామెంట్స్ చేశారు. బొక్క వీళ్ళు హీరోలవుతారా ? అంటూ మాట్లాడారు. కానీ నేను హీరో కావడానికి ఇండస్ట్రీలోకి రాలేదు. ఆర్టిస్ట్ కావడానికి వచ్చాను. కానీ మాకు ఆ పెయిన్ ఉంది. బిగ్ బాస్ నుంచి వచ్చాము. కానీ మేము హీరోస్ అవ్వోద్దా ? ఏ మాకు ఆ అవకాశం లేదా ? బాధ ఉంటుంది ఒక్కోసారి..మీకు ఇంకా సక్సెస్ రాలేదు ఏంటి అంటూ అడుగుతూ ఉంటారు కొంతమంది. సక్సెస్ అనేది మన చేతుల్లో ఏమీ ఉండదు. సక్సెస్ కి ఒక డెస్టినీ ఎప్పుడో ఒక రోజు వస్తుంది. సో సక్సెస్ కావాలంటే హార్డ్ వర్క్ చేయడమే..ఇప్పుడు మేము చేస్తున్నది కూడా అదే" అంటూ చెప్పుకొచ్చాడు సన్నీ. ఇక నెటిజన్స్ ఐతే సన్నీ మాటలు విని "మీరు ఎప్పుడూ సూపర్ హీరోనే..సక్సెస్ వస్తుంది వర్రీ కావొద్దు..." అని సపోర్ట్ చేస్తున్నారు. బుల్లితెర మీద "కల్యాణ వైభోగమే" సీరియల్ తో అందరినీ అలరించాడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన వారిలో చాలా కొద్దీ మందే సక్సెస్ అయ్యారు. ఇంకా కొంతమంది సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంటే ఇంకొందరు మాత్రం వచ్చిన అవకాశాలని యూజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.