English | Telugu

సమీరా బూందీ  లడ్డూలా ఉంటది..క్యారవాన్ లోకి సుప్రీతా...

సమీరా భరద్వాజ్ సింగర్ గా ఎంతో అద్భుతంగా పాడుతుంది. "నారాయణ" అంటూ రీసెంట్ గా ఆమె చేసిన ఒక రీల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈమె ఇప్పుడు చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షోకి బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపిక జోడిగా వచ్చింది. ఈ వారం ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ చెఫ్ జీవన్ ఉగాది సందర్భంగా లడ్డూ చేసే టాస్క్ ఇచ్చాడు. రీసెంట్ గా రిలీజైన ఈ షో ప్రోమో బాగా నవ్వు తెప్పిస్తోంది. ఇక అందరూ లడ్డూ చేస్తున్నారు. సమీరా బూందీ లడ్డూ ప్రిపరేషన్ లో ఉండగా చెఫ్ జీవన్, సుమ వాళ్ళ దగ్గరకు వచ్చారు దాంతో సమీరా "మా బూందీ తింటే బ్రాందీ తాగినంత కిక్కెక్కుతుంది" అనేసరికి దీపిక వావ్ అంది. "మాకు బూందీ చాలమ్మ బ్రాందీ వద్దు" అంటూ సుమ కౌంటర్ వేసింది. తర్వాత ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్ అనే కాన్సెప్ట్ ని సుమ యాదమ్మ రాజు - సుప్రీతకు ఇచ్చింది. "ఒక విలన్ వస్తాడు..అతన్ని చూసి మీరు భయపడాలి" అంటూ యాదమ్మరాజు సుప్రీతకు చెప్పాడు.

దానికి ఆమె "భయపడి ఎం చేయాలి క్యారవాన్ కి వెళ్లాలా" అని అడిగేసింది. "క్యారవాన్ కి ఎందుకు పోతారు మేడం" అని రివర్స్ లో అడిగాడు యాదమ్మ రాజు. దానికి అంబటి అర్జున్ - అమర్ దీప్ ఇద్దరూ తెగ నవ్వుకున్నారు. తర్వాత సుమా వచ్చి "సీన్ ఏంటో చెప్పు ముందు" అని యాదమ్మ రాజును అడిగింది. "సీన్ ఏమీ లేదు మేడం " అన్నాడు రాజు. దానికి సుమ "పదమ్మ మనం క్యారవాన్ కి పోదాం" అంది సుమా. దానికి రాజు ఫ్రస్ట్రేషన్ చెఫ్ జీవన్ ని పట్టుకుని "ఏ గుండు నువ్వు క్యారవాన్ తీసేయ్ " అన్నాడు అంటే జీవన్ ఒక్కసారిగా సీరియస్ గా చూసి షర్ట్ పట్టుకుని రాజుని పైకి లేపేసాడు. అలాగే సుమ అమర్ దీప్ - అంబటి అర్జున్ కి ఒక టాస్క్ ఇచ్చింది. మీరిద్దరూ లేడీస్, నైబర్స్ అంటూ కాన్సెప్ట్ చెప్పింది. దాంతో అర్జున్ బూందీ చేస్తూ "మన వీధి చివర సమీరా భరద్వాజ్ ఉంది చూసావా...పగలంతా పాడుతుంది నైట్ వాళ్ళాయన్ని ఒక ఆట ఆడుద్దని తెలుసా" అన్నాడు అర్జున్. తర్వాత అమర్ దీప్ "పొద్దున్నేమో దీపంలో వత్తి...రాత్రేమో కొవ్వొత్తి" అన్నాడు. "నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు లేదంటే చెప్పు తెగిపోద్ది" అంటూ అర్జున్ అమర్ దీప్ కి వార్నింగ్ ఇచ్చాడు.


Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.