English | Telugu
Karthika Deepam2 : దీపే అసలు వారసులు అనే నిజాన్ని దాస్ బయటపెట్టగలడా!
Updated : Mar 26, 2025
స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -314 లో... కాంచన దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. ఇన్ని రోజులు బావ నాకు దక్కలేదన్న కోపంతో అర్ధం లేని పనులు చేసి మిమ్మల్ని బాధపెట్టాను.. నన్ను క్షమించండి అత్తయ్య అని కాంచన తో జ్యోత్స్న అంటుంది. నిజం గానే జ్యోత్స్న మారిపోయిందా అని పారిజాతం అనుకుంటుంది. నువ్వు ఎప్పుడు ఇలా ఆలోచిస్తే అంతకన్నా ఏం కావాలి. దీపతో కూడా బాగుండు అని జ్యోత్స్న కి కాంచన చెప్తుంది.
ఆ తర్వాత కాశీ, స్వప్న, దాస్ ముగ్గురు ఎంగేజ్ మెంట్ కి వస్తారు. మిమ్మల్ని ఎవరు పిలిచారని శ్రీధర్ వాళ్ళతో వెటకారంగా మాట్లాడతాడు. మాకు ఇన్విటేషన్ ఉంది.. మీలాగా పిలవకుండా ఏం రాలేదని స్వప్న అంటుంది. అప్పుడే రెడీ అయి జ్యోత్స్న కిందకి వస్తుంటే దాస్ చూస్తాడు. దాంతో అతనికి గతం గుర్తుకి వస్తుంది. జ్యోత్స్న, గౌతమ్ లు పక్కపక్కన కూర్చొని ఉంటారు. దాస్ ఏదో చెప్పలని ట్రై చేస్తుంటే.. ఎవరు పిలిచారు వాడిని అంటూ శివన్నారాయణ కోప్పడతాడు. నేనే పిలిచానని పారిజాతం అంటుంది. దాస్ కి గతం గుర్తు వచ్చినట్లు ఉందని దశరథ్ అనుకుంటాడు. గతం గుర్తుకి వచ్చింది. ఇప్పుడు నా గురించి నిజం చెప్తాడేమోనని జ్యోత్స్న కంగారుపడుతుంది శివన్నారాయణ కోపంగా వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్పమని దశరథ్ తో అంటాడు. దాంతో వాళ్ళని బయట కూర్చోమని చెప్తాడు దశరథ్.
గౌతమ్ కి ఫోన్ రావడంతో బయటకు వెళ్లి మాట్లాడతాడు. దాస్ బయటున్న దీపని చూసి.. నువ్వు ఇక్కడున్నావేంటి లోపలికి పదా అంటూ లోపలికి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఏదో శబ్దం రావడం తో దాస్ మళ్ళీ గతం మర్చిపోతాడు. గౌతమ్ బయట ఫోన్ మాట్లాడి లోపలికి వస్తుంటాడు. దీప వాళ్ళు బయటకు వస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.