English | Telugu
అవి బొగ్గులా..గోభి మంచూరియానా ?
Updated : Mar 26, 2025
చెఫ్ మంత్ర సీజన్ ప్రాజెక్ట్ కే నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి ఇంకో కొత్త జంట వచ్చింది. వాళ్ళే విరాజిత - ప్రసాద్ బెహరా.. ఐతే గత ఎపిసోడ్స్ లో కనిపించిన విష్ణు ప్రియా - పృద్వి జోడి ఈ షో రాలేదు. కాబట్టి వాళ్ళ ప్లేస్ లోకి వీళ్ళను తెచ్చినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా విష్ణు ప్రియా - పృద్వి జోడి బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణు ప్రియా మీద కేసు ఫైల్ ఐన విషయం తెలిసిందే. పోలీసుల విచారణకు కూడా విష్ణు ప్రియా వెళ్ళింది. నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళ ప్లేస్ లోకి ప్రసాద్ బెహరా - విరాజిత ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. వస్తూనే గిన్నెలో మాడిపోయిన ఒక ఐటెంని తెచ్చాడు. "ఏదో తెచ్చినట్టున్నారు" అని సుమ అడగడంతో "బొగ్గులు, మీలాగా స్టవ్ మీద వండదు విరాజిత...బొగ్గుల మీద వండుతుంది..."అని చెప్పాడు.
అతని మాటలకు బ్రేక్ వేస్తూ "ప్రసాద్ ఇది గోబీ మంచూరియా" అని విరాజిత సీరియస్ గా చెప్పింది. "ఏంటి ఇది గోబీ మంచూరియానా " అంటూ సుమ, చెఫ్ జీవన్ ఇద్దరూ షాకయ్యారు. తర్వాత జీవన్ చేసిన ఉగాది పచ్చడితో శుభప్రదంగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పింది సుమ. "ఈ పచ్చడి లాగా మీ లైఫ్ ఎప్పుడూ పచ్చి పచ్చిగా ఉండాలి" అంటూ ఉగాది పచ్చడి తిన్న దీపిక విష్ చేసింది. దానికి జీవన్ తలబాదుకున్నాడు. తర్వాత ఉగాది పచ్చడి తిన్న యాదమ్మ రాజు..ముఖం అదోలా పెట్టి 65 అన్నాడు. అంటే చెఫ్ జీవన్ లాగి పెట్టి డిప్ప మీద ఒక్కటిచ్చి మార్కులు నేనియ్యాలి నువ్వు కాదు అన్నాడు. తర్వాత కంటెస్టెంట్స్ తో తనకు లడ్డూ తినాలని ఉంది అని చెప్తూ ఆ టాస్క్ ఇచ్చాడు. దానికి సుమ కౌంటర్ వేసింది. "అంటే అన్నానంటారు కానీ మీరే లడ్డూలా ఉన్నారు" అని కామెడీ చేసింది.