English | Telugu

జీవన్ అన్నా..అదిరిపోయే రూత్ లెస్ విలన్ క్యారెక్టర్ చెయ్యి అన్నా...ఒక నెటిజన్ సలహా

నటుడు జీవన్ ఇంతకు ముందు ఎవరో తెలీదు కానీ ఇప్పుడు బుల్లితెర మీద అందరికీ తెలుసు. ఎందుకంటే సుమతో కలిసి చెఫ్ గా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే అనే షో చేస్తున్నాడు. అందులో గుండుతో కనిపిస్తూ రకరకాల వంటల టాస్కులు ఇస్తూ జోడీస్ చేసే వంటలు తింటూ వంకలు పెడుతూ టేస్టో మీటర్ లో మార్క్స్ వేస్తూ ఉంటాడు. అలాంటి జీవన్ లో చాలా కోణాలు ఉన్నాయి. మంచి వంటలు చేస్తాడు, కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేసే గుణం ఉన్నవాడు, మంచి కమెడియన్ అలాగే జిమ్ లో మంచి వర్కౌట్ చేస్తూ అందరినీ మెస్మోరైజ్ చేస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా జీవన్ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. అందులో జిమ్ లోకి వెళ్లి వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కనిపించాడు . ఇక నెటిజన్స్ ఐతే ఆ వీడియో చూసి షాకయ్యారు.

ఫైర్ ఐన మంచు మనోజ్.. ఒక అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసావ్ శివ 

"అనగనగా ఈ ఉగాదికి" అంటూ ఈటీవీలో త్వరలో ప్రసారం కాబోయే షో నెక్స్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో యాంకర్ శివకి ఇచ్చిపడేశాడు మంచు మనోజ్. ఆల్రెడీ యాంకర్ శివకి ఈరోజు ప్రాణగండం ఉంది అంటూ ఆది సెటైర్ వేసాడు. ఐతే శివ కూడా మనోజ్ అన్నా ఒక క్వశ్చన్ అన్నా అనేసరికి "ఏ రెండో క్వశ్చన్ కి నువ్వు ఉండవా" అని కౌంటర్ వేసాడు. ఆ తర్వాత మనోజ్ "కావాలని ప్లాన్ చేసుకుని వచ్చి అలా కాంట్రోవర్సిగా చెప్తారో ఏమో....మరి మీ తప్పులు కూడా బయట పెట్టాలిగా.. నువ్వెండేది పిఆర్సినే కదా.. అందులో ఒక అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసావ్ ..ఆ అమ్మాయి పేరు..." అంటూ మంచు మనోజ్ ఫుల్ ఫైర్ అయ్యాడు.

 బిగ్ బాస్ కి నాగార్జున అన్ ఫిట్..ఆయనకు ఇంగ్లీష్ రాదు..

బిగ్ బాస్ హోస్ట్ అనేది మేజర్ రోల్...హోస్ట్ కి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. హోస్ట్ రోస్ట్ చేయొచ్చు కానీ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా రోస్ట్ చేయకూడదు అంటూ బిగ్ బాస్ హోస్ట్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున మీద బిగ్ బాస్ కంటెస్టెంట్ సోనియా ఆకుల ఫైర్ అయ్యింది. "నాకు తెలిసి రానా గారు హోస్ట్ ఐతే బాగుంటుంది అనుకుంటున్నా. అతనొక ట్రెండీ పర్సన్. ఫామిలీ రిలేషన్స్, ఫ్రెండ్ షిప్స్ గురించి అప్డేట్ గా ఉండే వ్యక్తి. మళ్ళీ నాగార్జున గారే హోస్ట్ గా వస్తే నేను బిగ్ బాస్ కి వెళ్ళను..బిగ్ బాస్ హౌస్ లో అంత సీన్ లేకపోయినా గౌతమ్ మీద నాగార్జున గారు మండిపడ్డారు. కానీ రానా కొంచెం ఆలోచించి కామెంట్ చేసే పర్సన్ అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చేసిన నంబర్ వన్ యారి వంటి షోస్ చూస్తే ఆయన పర్సెప్షన్స్ చాలా బాగుంటాయి, క్లారిటీగా ఉంటాయి. 20 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క బిగ్ బాస్ తో వచ్చింది. ప్రజలతో కనెక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. కానీ నాగ్ సర్ వస్తే బిగ్ బాస్ హౌస్ కి మళ్ళీ అవకాశం వచ్చినా వెళ్ళను.

Illu illalu pillalu : తెలివితో చందుని అరెస్ట్ చేపించిన భద్రవతి‌.. ఆ పెళ్ళి క్యాన్సిల్ !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -112 లో.... రామరాజు పై చెయ్ వేసినందుకు విశ్వని కొడుతాడు ధీరజ్. తనతో పాటు చందు కూడా విశ్వని కొడుతాడు. ఇద్దరిని తిరుపతి ఆపుతాడు. ఇక మీదట మాజోలికి వస్తే ప్రాణం తీసేస్తా అంటూ ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు... ఒళ్ళంతా దెబ్బలతో విశ్వ ఇంటికి వస్తాడు. ఏమైందని భద్రవతి అడుగుతుంది. జరిగింది మొత్తం విశ్వ చెప్తాడు. నా కొడుకు పై చెయ్ వెయ్యడానికి ఎంత దైర్యమని రామరాజు ఇంటి మీదకి సేనాపతి వెళ్తుంటే భద్రవతి ఆపుతుంది.

Brahmamudi: రాజ్ ని యామినితో చూసేసిన కావ్య.. అంతా మాయ చేస్తున్నారుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-675 లో.. అప్పూ దారిలో దిగిపోతూ.. అక్కా నువ్వు అనుకున్నట్లుగా ఆసుపత్రిలో ఆరోజు బావ నిన్ను జాయిన్ చేశాడంటున్నావ్ కాబట్టి సమాచారం తెలుసుకో జాగ్రత్తగా ఇంటికి వెళ్లు. సారీ అక్కా అని కావ్యకు మరీ మరీ చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్.. ఆ రోజు నేను కాపాడిన అమ్మాయిని చూస్తే నాకు ఎక్కడో కలిసిన ఫీలింగ్ ఎందుకొచ్చింది. తనని కలిస్తే నా గతం గురించి తెలుసుకోవచ్చేమో.. తను ఆసుపత్రిలో ఉండి ఉంటుందా.. తనని ఎలా కలవాలి.. యామినీకి తెలియకుండానే తన వివరాలు తెలుసుకోవాలని రాజ్ మనసులో ఫిక్స్ అవుతాడు. మరోవైపు యామినీ కూడా కావ్య గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. ఆమెకు డౌట్ ఉంది. రాజ్.. ఆ రోజు ఆసుపత్రిలో జాయిన్ చేసిన అమ్మాయి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాడు.. ఎందుకు అంత స్పెషల్‌గా ఫీల్ అవుతున్నాడు. కొంపదీసి ఆమె కానీ రాజ్ భార్య అయ్యి ఉంటుందా.. ఎలా అయినా ఈ విషయం రాజ్‌కి తెలియకుండా తెలుసుకోవాలని యామినీ కూడా ఫిక్స్ అవుతుంది. మరోవైపు డాక్టర్ అపాయింట్‌మెంట్‌ తీసుకుని రాజ్, యామినీ ఇద్దరు ఆసుపత్రి హాల్లో కూర్చుని ఎదురు చూస్తుంటారు. మనసులో మాత్రం ఒకరికి తెలియకుండా ఒకరు ఆ రోజు ఆసుపత్రిలో జాయిన్ చేసిన అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు.

Karthika Deepam2: జ్యోత్స్న మాటలకి దిగొచ్చిన శివన్నారాయణ.. కాంచన దగ్గరికి మొత్తం వచ్చేసారుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-311లో..  జ్యో అడిగిన ప్రశ్నకు శివనారాయణ ఆవేశం రెట్టింపు అయిపోతుంది. దాంతో పొలమారి అతడికి తీవ్రమైన దగ్గు వస్తుంది. వెంటనే దశరథ్, సుమిత్ర కంగారుపడి.. నాన్నా.. మావయ్యగారు అని అతడ్ని పట్టుకుంటారు. జ్యోత్స్న వెంటనే పరుగున వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చి కొంచెం తాగు అంటుంది. వాటర్ బాటిల్‌ని తోసేస్తూ.. వాటర్ తాగకపోతే దగ్గు ఆగుతుంది. కానీ నిన్ను ఆపకపోతే వాడు ఆగేలా లేడు అని తిడుతూనే ఉంటాడు. కాసేపటికి అతడి దగ్గు ఆగుతుంది. లేదు తాతా.. నేను ఏ తప్పు చేయలేదు.. రేపు నిశ్చితార్థంలో అత్త ఫ్యామిలీ లేకపోతే జనం ఏం అనుకుంటారు? శివనారాయణ గారు కూతుర్ని తరిమేశారు.. ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదట అని చెప్పుకుంటారు. అప్పుడు పోయేది ఎవరి పరువు.. వాళ్లదా.. మనదా.. అలా అని నేరుగా అత్తను పిలిస్తే వస్తుందా అంటే.. రాదు. అత్త రావాలని మమ్మీ డాడీ కోరుకుంటున్నారు. ఆల్రెడీ నిన్ను అడిగారు.. కానీ నువ్వు వద్దు అన్నావని జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటుంది. మరి అప్పుడైనా అర్థం  కదా వాళ్లు రావడం నాకు ఇష్టం లేదని శివన్నారాయణ అంటాడు. చెల్లెలికి మనం తప్ప ఇంకెవరున్నారు నాన్నా అని దశరథ్ అంటాడు. మనకు ఏమైనా వంద మంది ఉన్నారా. .అంతా కలిస్తే ఒక పది మంది కూడా లేరు.. ఉన్నవాళ్లనైనా కూతురికి ఫంక్షన్‌కి పిలుచుకోవాలని తల్లిగా నేను ఆశపడతాను కదా మావయ్యగారని సుమిత్ర అంటుంది. ఇవన్నీ కాదు తాతా.. నా నిశ్చితార్థానికి అత్త బావ రావాలని కోరుకుంటున్నాను.. నా కోరిక నువ్వు తీరుస్తావా లేదా అంటూ జ్యోత్స్న మాట్లాడుతుంటే తాత కాస్త శాంతించి వింటూ ఉంటాడు.

ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది...హీరోయిన్ లైలాకి మహేశ్వరీ కౌంటర్

సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి వింటేజ్ బ్యూటీగా మహేశ్వరీ వచ్చింది. నీకోసం, పెళ్లి వంటి మూవీస్ తో హిట్ కొట్టి ఆడియన్స్ ని మెస్మోరైజ్ చేసిన హీరోయిన్..ఆమె ఇన్నాళ్లకు బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చింది. అలాగే మరో క్యూట్ అండ్ బబ్లీ హీరోయిన్ లైలా...1997 లో "ఎగిరే పావురమా" మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించి ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ షో హోస్ట్ రవి ఐతే మహేశ్వరితో ఒక డైలాగ్ వేసాడు. "పెళ్లి మీద ఎలాంటి అభిప్రాయం లేని నాకు మీరు నటించిన పెళ్లి మూవీ వలన పెళ్లి మీద ఒక మంచి అభిప్రాయం వచ్చింది" అని చెప్పాడు.

సుప్రీతా డ్రెస్ మీద యాదమ్మ రాజు కామెంట్స్...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఈ వారం షోలో యాదమ్మ రాజు - సుప్రీతా కామెడీ మాములుగా లేదు. యాదమ్మ రాజు నార్మల్ గా ఫుల్ డ్రెస్ వేసుకొచ్చాడు. కానీ సుప్రీతా మాత్రం చాలా పొట్టి డ్రెస్ వేసుకొచ్చింది. దాంతో యాదమ్మ రాజు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మీద కామెంట్స్ చేసాడు. "ఏంటి డాన్స్ మొత్తం హుషారుగా చేసి అంత డల్ ఇపోయావ్" అని అడిగింది సుమ. "మొన్న ఇక్కడ నా వంటకు సెకండ్ ప్లేస్ ఇచ్చారు. ఇదే ఊపుతో ఇంటికి వెళ్లి వంట చేసి మా ఆవిడకు పెట్టాను..ఇప్పటికి మూడు రోజులయ్యింది మాట్లాడక" అన్నాడు బాధపడుతూ యాదమ్మ రాజు. "ఎవ్వరైనా సరే నీ వంట తిన్నవాళ్ళు నీతో మాట్లాడరు" అని చెప్పింది సుమ. దానికి యాదమ్మ రాజు "అర్జెంటుగా డ్రెస్ మార్పించండి" అన్నాడు. దానికి సుమ "నా డ్రెస్సా" అన్నది. మీది కాదు ఈమెది అంటూ సుప్రీతా వైపు చూపించాడు.

Karthika deepam 2 : కాబోయే పెళ్లి కూతురు  ఆర్డర్.. శివన్నారాయణ వార్నింగ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam 2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -310  లో..... కార్తీక్ రెస్టారెంట్ కి పారిజాతం వెళ్లి జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కోసం ఫుడ్ ఆర్డర్ ఇస్తుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తుంటారు. వాళ్ళు రాకముందే పారిజాతం వెళ్లి కార్ లో కూర్చుంటుంది. మేనేజర్ కార్తీక్ కి ఆర్డర్ గురించి చెప్తాడు. ఎవరు ఇచ్చారని కార్తీక్ అడుగగా పేపర్ పై శివన్నారాయణ అని రాసి ఉంటుంది. అది చూసి కార్తీక్ ఆశ్చర్యపోతాడు. వచ్చిందెవరని కార్తీక్ అడుగగా పేరు అడగలేదని మేనేజర్ చెప్తాడు. కార్తీక్ ఫోన్ లో పారిజాతం ఫోటో చూపిస్తూ ఈవిడేనా అని అడుగుతాడు. ఆవిడే అని మేనేజర్ చెప్తాడు. నాకు చెప్పకుండా ఎందుకు ఆర్డర్ తీసుకున్నావని మేనేజర్ ని కార్తీక్ అడుగుతాడు.