English | Telugu

టీవీ షోస్ లో ఎనెర్జీతో కనిపించే దీపికా సంతోషం వెనక ఉంది ఇదా


దీపికా రంగరాజు బుల్లితెర మీద అల్లరి చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మముడి సీరియల్ లో కావ్య రోల్ లో డీసెంట్ లుక్ లో కనిపిస్తుంది కానీ మిగతా షోస్ లో చూస్తే ఆమె అల్లరి మాములుగా ఉండదు. డాన్స్ ఐకాన్ లో ఐతే కంటెస్టెంట్స్ కి ఇచ్చే కామెంట్స్ , చేసే డాన్స్ లు, వచ్చే గెస్టులను భయపెట్టడాలు చేస్తూ ఉంటుంది. అలాగే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే షోలో చెఫ్ జీవన్ ని ఆట పట్టించడం, హోస్ట్ సుమతో పరాచికాలు ఆడుతూ కనిపిస్తుంది. అలాంటి దీపికా ఇప్పుడు తన నవ్వు వెనక ఉన్న అసలు రహస్యాన్ని ఒక ఇన్స్టా రీల్ ద్వారా చెప్పేసింది. పుష్పలో శ్రీవల్లి గెటప్ లో కనిపించిన దీపికా 100 రూపాయల నోటును మడత పెట్టి గాంధీ తాత బొమ్మను చూపిస్తూ "నేను ఎప్పుడైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు నన్ను నవ్వించే వ్యక్తి ఈయనే.

నా మూడ్ స్వింగ్స్ ని హ్యాపీ మూమెంట్స్ గా మార్చే వ్యక్తి కూడా ఈయనే" అంటూ చెప్పుకొచ్చింది. ఇక నెటిజన్స్ ఐతే దీపికా అందాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. ఒక నెటిజన్ ఐతే "మేడం సర్ మేడం అంతే. నిజాన్ని అంగీకరించినందుకు ధన్యవాదాలు డబ్బు మూడ్ స్వింగ్స్‌ను సంతోషంగా, చిరునవ్వుగా మార్చేయగలదు. " అంటూ కామెంట్ చేశారు. టీవీ షోస్ లో దీపికను కానీ ఆమె కౌంటర్స్ ని ఆమె తెలుగుని ఆమె డైలాగ్స్ ని తట్టుకోవడం చాలా కష్టం. అలుపులేకుండా మాట్లాడుతూనే ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైములో లేడీ కమెడియన్ గా దీపికా చాలా పేరు సంపాదించేసింది. దీపికా లేకపోతె ఆ షోకి రేటింగ్ రాదేమో అన్న స్థాయికి వెళ్ళిపోయింది. ఏదేమైనా ఎవరికైనా ఎనెర్జీ రావాలంటే అది కేవలం డబ్బు వల్లే అంటూ దీపికా ఈ రీల్ ద్వారా చెప్పేసింది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.