English | Telugu

Brahmamudi : సమాధుల దగ్గరికి వెళ్లిన యామిని.. అతనేమో కావ్యతో మీటింగ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -685 లో.... కావ్య రెడీ అయి వెళ్తుంటే రాహుల్, రుద్రాణి ఇద్దరు తనని ఫాలో అవుతుంటారు. కావ్య నిజంగానే రాజ్ ని కలవడానికి వెళ్తుందా.. ఎక్కడికి వెళ్తుందని అనుకుంటారు. మరొకవైపు రాజ్ కోసం యామిని వెతుకుతుంటుంది. బావ ఎక్కడ అని వాళ్ళ డాడ్ ని అడుగుతుంది యామిని‌‌. నువ్వు స్పృష్టించిన రాజ్ పేరెంట్స్ సమాధుల దగ్గరికి వెళ్ళాడని వైదేహి చెప్తుంది. ఎందుకు వెళ్ళనిచ్చారు.. తనకి ఎవరైనా ఎదరుపడితే పరిస్థితి ఏంటని వైదేహిపై యామిని కోప్పడుతుంది. నేను వెళ్తానంటూ యామిని బయల్దేర్తుంది.

కావ్య రెస్టారెంట్ దగ్గర లోపలికి వెళ్తుంది. తన వెనకాలే రాహుల్, రుద్రాణి వెళ్తారు. కావ్య కూర్చొని ఉంటుంది. తనలో తాను మాట్లాడుకుంటుంది. అదంతా రాహుల్ వీడియో తీస్తాడు. ఈ బ్రాహ్మస్త్రం చాలు దాని సంగతి చెప్పడానికి అని రుద్రాణి అంటుంది. రాహుల్, రుద్రాణి బయటకు వెళ్లిపోతుంటే అప్పుడే రాజ్ వస్తాడు. ఒకరికొకరు ఎదరు పాడబోతుంటే అప్పుడే రాజ్ ని పక్కకి లాగుతుంది కావ్య. ఏంటని రాజ్ అడుగతాడు. మిమ్మల్ని పిలుస్తున్నా మీరు పట్టించుకోవడం లేదని లాగానంటూ కావ్య అంటుంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుటుంటారు. అప్పుడే యామిని ఫోన్ చేస్తుంది. బావ ఎక్కడున్నావని అడుగుతుంది. అమ్మనాన్నల సమాధుల దగ్గరికి వచ్చానని రాజ్ అంటాడు. నేను ఇక్కడే ఉన్నానని యామిని అనగానే అంటే అక్కడ నుండి ఇప్పుడే పక్కన ఉన్న కేఫ్ కి వచ్చిన అని రాజ్ చెప్తాడు. దాంతో వస్తున్న అని యామిని ఫోన్ కట్ చేస్తుంది.

రాజ్ తన ముందున్నా.. ఎవరో పరాయి వ్యక్తితో ఉన్నట్టు ఉండడం కావ్య భరించలేక ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడే ఉంటే ఎక్కడ నిజం చెప్పేస్తానెమోనని రాజ్ ఫోన్ మాట్లాడి రాగానే వెళ్తున్నానంటూ వెళ్ళిపోతుంది. తరువాయి భాగంలో కావ్య తనలో తను మాట్లాడుకునే వీడియోని రుద్రాణి ఇంట్లో టీవీలో ప్లే చేస్తుంది. అది చూసి అందరు షాక్ అవుతారు. అప్పుడే కావ్య వస్తుంది. ఇన్ని రోజులు నేను చెప్తే ఎవరు నమ్మలేదు కదా.. ఇకనైనా ఆలోచించండి అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.