English | Telugu

అబద్దం చెప్పి డబ్బులు తీసుకుని సైకిల్ కొన్నా...అమ్మంటే భయం..


లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ గురించి చెప్పక్కర్లేదు. సిల్వర్ స్క్రీన్ మీద ఒక సీనియర్ స్టార్ గా ఆమె ఒక జూనియర్ స్టార్ గా ఈయన అలరిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా వీళ్ళిద్దరూ కలిసి అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే మూవీ చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బుల్లితెర మీదకు అడుగుపెట్టారు. ఉగాది సందర్భంగా స్టార్ మాలో ప్రసారమైన "మా ఇంటి పండగ" షోలోకి వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు.

ఇక బుల్లితెర లేడీ స్టార్స్ అంతా కలిసి విజయశాంతి మూవీస్ కి సంబంధించిన సాంగ్స్ తో మంచి ట్రిబ్యూట్ ఇచ్చారు. ఇక కళ్యాణ్ రామ్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు యాంకర్స్ విష్ణు ప్రియా, అంబటి అర్జున్. "ఎప్పుడైనా ఏ విషయంలో ఐనా అబద్దం చెప్పి ఇంట్లో దొరికిపోయారా" అని అడిగేసరికి "హా దొరికిపోయాను. అబద్దం చెప్పి దొరికిపోయాను. సైకిల్ కొనుక్కోవడానికి డబ్బులు తక్కువయ్యాయి. దానికోసం స్కూల్ లో ఒక సోషల్ యాక్టివిటీ ఉందని చెప్పి స్కూల్ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని సైకిల్ కొనుక్కున్నా.. ఆ సైకిల్ కొనుక్కుని ఇంటికెళ్ళినందుకు సాయంత్రం చెంప మీద గట్టి దెబ్బ పడింది మా నాన్న దగ్గర నుంచి. అది ఎప్పటికీ మర్చిపోలేదు." అని చెప్పాడు. "ఏదైనా కోతి పని చేసి ఇంట్లో దెబ్బలు తిన్నారా" అని అడిగేసరికి "స్కూల్ లో ఫ్రీ పీరియడ్ వచ్చింది అని నన్ను క్లాస్ ని మానిటర్ చేయమన్నారు. అందరినీ సైలెంట్ గా ఉండమని చెప్పాను. కానీ అల్లరి చేసిన పిల్లల జుట్టు కత్తిరించేసాను." అని చెప్పాడు. ఇక ఫైనల్ గా "ఇంట్లో అమ్మకా లేదా నాన్నకా ఎక్కువగా బయపడింది" అని అడిగేసరికి "ఇద్దరూ అంటే చాలా భయం. కానీ మా అమ్మ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. అంటే 100 కి 89 మార్క్స్ వచ్చిన అమ్మ కొట్టేవారు. ఎందుకు 90 కంటే ఎక్కువ రాలేదు అని. ఒంటి మీద స్కేల్స్ విరిగిపోయేవి." అంటూ చెప్పాడు కళ్యాణ్ రామ్. ఏదేమైనా ఇంట్లో మాత్రం స్ట్రిక్ట్ వాతావరణం ఉండేది అన్న విషయం తెలుస్తోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.