English | Telugu

Karthika Deepam2  : ఆమె మాటతో శౌర్యని దీప వదిలేస్తుందా.. కార్తీక్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -530 లో.....జ్యోత్స్న బట్టలు పారిజాతం సర్దుతుంది. ఏంటి గ్రానీ ఎందుకు బట్టలు ప్యాక్ చేస్తున్నావని జ్యోత్స్న అడుగుతుంది. ఇప్పుడు నీ టైమ్ బాలేదు.. కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళు అని పారిజాతం అంటుంది. ఐడియా బాగుంది కానీ నా కంటే నువ్వు వెళ్తే బాగుటుందని జ్యోత్స్న అంటుంది. ఆ కార్తీక్ గాడిని మర్చిపోయి హ్యాపీగా ఉండమని పారిజాతం సలహా ఇస్తుంది కానీ జ్యోత్స్న అవేం పట్టించుకోదు. మరొకవైపు దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. దీప కోపంగా ఉందని తనని కూల్ చెయ్యడానికి ట్రై చేస్తాడు.  

న్యూస్ ఛానెల్స్ మీద ఇంటరెస్ట్ పోయింది...

బుల్లితెర మీద శ్రీవాణి, విక్రమాదిత్య జోడి ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. వీళ్ళు సీరియల్స్ లో నటిస్తూ మరో వైపు యూట్యూబ్ ఛానెల్స్ ని రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ అమ్మాయి రాజనందిని కూడా చదువుకుంటూ ఢీ డాన్స్ షోలో కంటెస్టెంట్ గా చేస్తోంది. రీసెంట్ గా శ్రీవాణి ఒక ఇంటర్వ్యూలో కుటుంబ కలహాల గురించి చెప్పుకొచ్చింది. "నేను తమిళ్ సీరియల్ చేస్తున్నాను ఆ టైములో. మా అన్నయ్య చనిపోయినప్పుడు నేను చూసి కార్యక్రమం అయ్యేంత వరకు ఉండకుండా నేను డైలీ షూటింగ్ కాబట్టి నేను వెళ్ళిపోయాను. ఇక తర్వాత వెళ్లి పలకరించిన పాపానికి పెద్ద రాద్ధాంతం అయ్యింది.

వరుణవి డైలాగ్ కి పడీ పడీ నవ్విన రోజా, అనిల్

జీ తెలుగులో సరిగమప లిటిల్ చాంప్స్ ప్రతీ వారం పిల్లల్ని పెద్దలను అలరిస్తోంది. ఇక ఈ వారం కొత్త ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే సెంట్రాఫ్ అట్రాక్షన్ గా వరుణవి ప్రతీ వారం కొత్త కొత్త పాటలు ఎంటర్టైన్ చేస్తోంది. ఈ ప్రోమోలో వరుణవి స్టేజి మీదకు రాగానే "హాయ్ సుధీర్ మామ" అని పలకరించింది. "ఇదేంటి సడెన్ గా ఇంత మార్పు వచ్చింది నీలో" అని అడిగాడు సుధీర్. "పాత సినిమాలు చూడలేదా అందులో పిల్లలు ఇలాగే మంచిగా ఉంటారు" అని చెప్పింది. "పాత సినిమాలు పెద్దగా చూడలేదమ్మా" అన్నాడు సుధీర్. "అప్పట్లోనే పుట్టావ్  కదా ఐనా చూడాలేదా" అని కౌంటర్ వేసింది. దానికి ఆన్సర్ చెప్పలేదు సుధీర్.

ఎన్ని షోలు మారినా రోజా ఏజ్ మారదా...

సరిగమప లిటిల్ చాంప్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ జోష్ గా ఫన్నీగా ఉంది. ఇక రెట్రో స్పెషల్ తో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ రాబోతోంది. రెట్రో థీమ్ ఎప్పుడూ డిఫరెంట్ గా ఉంటుంది. ఓల్డ్ సాంగ్స్ కి కొత్త కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో చిన్నారి కంటెస్టెంట్స్ అలరించారు. వర్షిణి స్టేజి మీదకు వచ్చి "నేను ఒకరిని ప్రేమించాను" అని చెప్పింది. వెంటనే సుధీర్ వచ్చి "ఎవరతను" అనేసరికి "గోపి"అని చెప్పింది. "ప్రతీ బ్లాక్ అండ్ వైట్ ఫిలింలో అదే రాధ అదే గోపి" అంటూ డైలాగ్ వేసాడు అనిల్ రావిపూడి. ఇక జడ్జెస్ కూడా ఓల్డ్ రెట్రో స్టైల్ గెటప్స్ తో అలరించారు. ,అనంత శ్రీరామ్ కూడా వచ్చి "రాధ రాధ రాధ" అనేసరికి "ఆవిడే పేరు రాధ అనే పెట్టుకుంది" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో కామెడీగా కామెంట్ చేశారు అనిల్. ఇంతలో రోజా ఎంట్రీ ఇచ్చింది.

సీరియల్ లో గ్లామర్ లేదని వచ్చా..ఫ్యామిలీ లైఫ్ ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ ఉండదు

పవిత్ర ఈ మధ్య ఫ్యామిలీ స్టార్స్ కి వచ్చిన అందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం ఈ షోకి వచ్చిన స్టార్స్ ని రోస్ట్ చేసింది. రకరకాల ప్రశ్నలు అడిగి సెటైర్స్, కౌంటర్లు వేసి నవ్వించింది. ఇక ఈ షోకి వచ్చిన సమీర్ ని, సుహాసినిని కొన్ని ప్రశ్నలు వేసింది. "సమీర్ గారు మిమ్మల్ని చూస్తుంటే ఒకటి అడగాలనిపిస్తోంది" అంటూ పాగల్ పవిత్ర ఒక ప్రశ్న అడిగింది. "సారీ నేను ఆ టైపు కాదు" అంటూ సమీర్ సీరియస్ ఫేస్ తో ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. "ఐతే ఈయన్ని అడగండి" అంటూ సుధీర్ వైపు చూపించాడు సమీర్. "ఆయన వేరే టైపు" అంటూ పవిత్ర డైలాగ్ వేసింది. "మీకు రెండే రెండు అప్షన్స్ ఇస్తాను. ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి.  ఆలోచించి చేసుకోండి.  భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు" అంటూ కొంచెం కామెడీ డైలాగ్స్ వేసేసరికి సమీర్ నవ్వేసాడు .

లెజెండరీ యాక్టర్స్ ని గుర్తు చేసుకున్న శ్రీదేవి డ్రామా కంపెనీ

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. నాటి లెజెండరీ యాక్టర్స్ ని తలుచుకుంటూ ఈ ఎపిసోడ్ రాబోతోంది. ఇక జడ్జ్ ఇంద్రజ శివగామి రోల్ లో వచ్చింది. "ఎన్నో వినోదాలను ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది, చూసింది. కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇదే నా మాట నా మాటే శాసనం" అంటూ చెప్పింది.  నూకరాజు బాహుబలిగా వచ్చి "మీరు ఈ గెటప్ ఎందుకు వేశారు నన్ను ఈ గెటప్ ఎందుకు వేయించారు" అని అడిగాడు. మన ఆర్టిస్టులంతా ఈ సినిమాలలో వచ్చిన పాపులర్ గెటప్స్ వేసుకుని ఇక్కడికొచ్చి పెర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుంది" అని అడిగేసరికి అదిరిపోద్ది అని చెప్పాడు నూకరాజు.

పెళ్లి లైఫ్ లాంగ్ కమిట్మెంట్... ఇప్పుడున్న జెనెరేషన్ కి ఇది సెట్ కాదు

నిజానికి పెళ్లి ఒక పెద్ద కమిట్మెంట్. ఈ జెనెరేషన్ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఇష్టపడడమే లేదు. ఇండిపెండెంట్ గా ఉంటాం అంటూ ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు. ఈ వారం ఫ్యామిలీ స్టార్స్ లో కూడా ఈ పెళ్లి అనే టాపిక్ మీద ఈ షోకి వచ్చిన స్టార్స్ అంతా మాట్లాడారు. "అసలు పెళ్లి ఎందుకు వద్దో ఒక రీజన్ చెప్పండి" అని సుధీర్ అడిగాడు. "పెళ్లి అనేది ఒక పెద్ద కమిట్మెంట్ చాలా బాధ్యతలు ఉంటాయి. స్వేచ్ఛ ఉండదు. ఆ బాధ్యతలను నెరవేర్చడంలోనే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళడంలోనే లైఫ్ సర్వనాశనం ఐపోతుంది" అంటూ నటి హేమ చెప్పింది.