English | Telugu
Jayam serial: గంగని సెలెక్షన్స్ నుండి దూరం చేయాలని చూస్తున్న ఇషిక, పారు!
Updated : Jan 4, 2026
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -159 లో... ఈ రోజు ఛాంపియన్ షిప్ సెలక్షన్ జరుగుతుంది. అందులో సెలక్ట్ అయితే వాళ్లే కోచింగ్ ఇస్తారని గంగతో రుద్ర చెప్తాడు. ఎందుకు సర్ మీరు ఆల్రెడీ నన్ను ప్రాక్టీస్ చేపిస్తున్నారు కదా అని గంగ అంటుంది. అవును కానీ అందులో సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ అని రుద్ర చెప్తాడు. మనం త్వరగా వెళ్ళాలి వెళ్లి అప్లికేషన్ ఫిల్ చెయ్యాలని రుద్ర అనగానే గంగ సరే అంటుంది. అదంతా ఇషిక వింటుంది. గంగని బయటకి వెళ్లకుండా లాక్ చెయ్యాలని ఇషిక అనుకుంటుంది.
గంగ హడావిడిగా కిచెన్ లో ఉన్న వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తుంది. మళ్ళీ ఇషిక వచ్చి అంత వర్క్ అయితే పూజకి సంబంధించిన వర్క్ చేద్దామని గంగతో అంటుంది. ఇప్పుడా అని గంగ అనగానే మళ్ళీ అత్తయ్య కోప్పడుతుందని ఇషిక అనగానే గంగ సరే అంటుంది.
ఆ తర్వాత గంగని వెళ్లకుండా ఆపాలని అనుకుంటుంది. అత్తయ్య అన్ని పనులు నేను చేసానని శకుంతలతో ఇషిక అనగానే నువ్వే అన్ని పనులు ఎందుకు చేస్తున్నావని శకుంతల అంటుంది. నేను చేస్తానని ప్రీతీ అనగానే నువ్వు రెస్ట్ తీసుకోమని శకుంతల చెప్తుంది. నేను చేస్తానని ప్రమీల అనగానే ఒక్కదానివే ఏం చేస్తావ్ ఉందిగా ఆ గంగ.. తనని చేయమని చెప్పండి అని శకుంతల చెప్తుంది.
తరువాయి భాగంలో గంగ, రుద్ర సెలక్షన్ దగ్గరికి వెళ్తారు. పారు వస్తుంది. పారు కావాలనే గంగ మీద ఏదో పడేలా చేస్తుంది. దాంతో గంగ క్లీన్ చేసుకోవడానికి వెళ్తుంది. పారు వెళ్లి డోర్ లాక్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.