English | Telugu
Karthika Deepam 2: అటు స్వప్న ఎమోషనల్.. ఇటు కార్తీక్!
Updated : Jan 4, 2026
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -558 లో.... శ్రీధర్ కి స్వప్న టాబ్లెట్ తీసుకొని వచ్చి ఇస్తుంది. స్వప్న కాంచనతో అన్న మాటలు శ్రీధర్ గుర్తు చేసుకుంటాడు. మీ నాన్న కాశీ విషయంలో తప్పు చేసాడనుకుంటున్నావా అని స్వప్నని శ్రీధర్ అడుగుతాడు. ఒక మావయ్యగా అల్లుడు జీవితం బాగుండాలని అనుకున్నారని స్వప్న చెప్తుంది. శ్రీధర్ కాళ్లపై పడుకొని తనలో ఉన్న బాధని చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతుంది స్వప్న. స్వప్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. అదంతా దూరం నుండి చూస్తున్న కావేరి ఏడుస్తుంది.
మరొకవైపు హాస్పిటల్ నుండి కార్తీక్, దశరథ్ ఇంటికి వస్తారు. వాళ్ళకి ఎదురుగా దీప వెళ్లి ఏమైందని అడుగుతుంది. ఏం పర్లేదు అమ్మ రిపోర్ట్స్ లో ఏం ప్రాబ్లమ్ లేదని దీపతో దశరథ్ చెప్పి లోపలికి వెళ్తాడు. ఏమైంది బావ అని దీప అడుగుతుంది. కార్తీక్ నిజం చెప్పలేక బాధ బయటకి కనిపించకుండా కవర్ చేస్తూ ఏం లేదని చెప్తాడు.
కార్తీక్ ఇంట్లోకి వెళ్ళగానే మీ మావయ్యకి ఎలా ఉంది రిపోర్ట్స్ లో ఏం వచ్చిందని సుమిత్ర అడుగుతుంది. రిపోర్ట్స్ ఏంటని శివన్నారాయణ అడుగుతాడు. అయ్యో మర్చిపోయి అన్నానురా.. నాకు బాలేదని చెప్తానని కార్తీక్ తో సుమిత్ర చెప్తుంది. బాలేంది నీకే అత్త అని కార్తీక్ మనసులో అనుకుంటాడు.
ఏం లేదు తాత నార్మల్ టెస్ట్ లు చేస్తారు కదా.. అవే ఏం లేదు.. అత్తకి బ్లడ్ తక్కువ ఉందట మావయ్యకి విటమిన్ డి తక్కువ అంట అని కార్తీక్ చెప్తాడు. అయితే రిపోర్ట్స్ ఇవ్వు చూస్తానని శివన్నారాయణ అనగానే ఆల్రెడీ డాక్టర్ చూసి చెప్పిందని కార్తీక్ అంటాడు.
ఒరేయ్ కార్తీక్ నువ్వు కూర్చొరా అని సుమిత్ర లోపలికి వెళ్లి పాయసం తీసుకొని వచ్చి కార్తీక్ కి తినిపిస్తుంది. నీకు పాయసం అంటే ఇష్టం కదా మళ్ళీ తినిపించే ఛాన్స్ వస్తుందో రాదో.. ఎందుకంటే నీకు పిల్లలు పుడితే నీకు తినిపించలేం కదా అని సుమిత్ర అంటుంది. దాంతో కార్తీక్ బాధపడతాడు. బావ ఎందుకు బాధపడుతున్నాడని దీప అనుకుంటుంది. హ్యాపీగా ఉండాల్సిన బావ డల్ గా ఉన్నాడేంటని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.