English | Telugu

Jayam serial : పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా రుద్రని కాపాడిన గంగ!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -158 లో ......రుద్ర హడావిడిగా వెళ్తాడు. గంగ గదిలో ఉండగా అప్పుడే ఇషిక వస్తుంది. ఇప్పుడు రుద్ర బావ పారు దగ్గరికి వెళ్ళాడు. తనకి ఇంకా రుద్ర బావపై ప్రేమ ఉంది. ఇప్పుడు తనవైపుకి తిప్పుకుంటుందని ఇషిక అంటుంది. దాంతో గంగలో టెన్షన్ మొదలవుతుంది. రుద్ర వెనకాలే గంగ వెళ్తుంది. రుద్ర వెళ్తుంటే మధ్యలో కార్ ఆగిపోతుంది. రుద్ర కంటే ముందే గంగ హోటల్ కి వెళ్తుంది.

అక్కడ పారు ఎక్కడుందో కనుక్కొని లోపలికి వెళ్తుంది. మరొకవైపు ప్రమీల, ప్రీతి అందరు సరదాగా మాట్లాడుకుంటుంటే శోభనం గదిలో గంగ, రుద్ర బావ లేరు.. హడావిడిగా ఒకరి తర్వాత ఒకరు బయటకి వెళ్లారని ఇషిక చెప్తుంది. మరొకవైపు గంగ లోపలికి రావడం చూసి పారు తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి రుద్ర వచ్చాడు. లాక్ చేయమని చెప్తుంది. ఆల్రెడీ పారు ఉన్న గదిలో గంగ ఉంటుంది. రుద్ర వస్తున్నాడని కర్టెన్ చాటున దాక్కుంటుంది. మరొకవైపు పారు పోలీసులకి ఫోన్ చేస్తుంది. రుద్ర లోపలికి వచ్చి పారు అని పిలుస్తుంటే బయట నుండి తన ఫ్రెండ్ వచ్చి ఇందాకే పారు వెళ్ళిపోయింది. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. నేను చాలా హా్ట్ అంటూ దగ్గరికి వస్తుంటే రుద్ర తోసేస్తాడు. దాంతో బ్లౌజ్ చింపుకొని హెల్ప్ అంటూ అరుస్తుంది. డోర్ తియ్యగానే పోలీసులు ఉంటారు. నన్ను బలవంతం చెయ్యబోయడని చెప్పగానే రుద్రని అరెస్ట్ చేయమని ఇన్‌స్పెక్టర్ చెప్తాడు. ఆగండి అని లోపల నుండి గంగ వచ్చి.. నా భర్త ఏ తప్పు చెయ్యలేదని చెప్తుంది.

ఎలా నమ్మాలని ఇన్స్‌పెక్టర్ అనగానే గంగ రూమ్ లో జరిగింది వీడియో తీసింది చూపిస్తుంది. దాంతో ఆ అమ్మాయిపై ఇన్‌స్పెక్టర్ కోప్పడి స్టేషన్ కి రమ్మంటాడు. నా భర్తకి సారీ చెప్పమని గంగ అనగానే ఆమె రుద్రకి సారీ చెప్తుంది. పారు భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. ఈ పాటికీ రుద్రని అరెస్ట్ చేసి ఉంటారని అనుకుంటారు. మరొకవైపు రుద్ర గంగ ఎక్కడికి వెళ్లారని ఇంట్లో అందరు టెన్షన్ పడుతారు. రుద్ర, గంగ ఇంటికి వస్తారు. ఇంటి బయటే ఉంటారు. జరిగింది ఏది ఇంట్లో చెప్పకండి అని గంగ అంటుంది. అసలు నువ్వు అక్కడికి ఎలా వచ్చావ్.. నేను పారుతో మాట్లాడినప్పుడు డౌట్ పడి వచ్చావా అని రుద్ర అంటుంటే.. విన్న మాట నిజమే కానీ డౌట్ తో కాదు మీకు ఏదో ప్రాబ్లమ్ వస్తుందేమోనని గంగ అంటుంది. ఇక కాసేపటికి ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.