English | Telugu

లాక్ డౌన్ టైములో సాయి శ్రీనివాస్ మూవీ రిలీజ్ కాలేదు.. నిజంగా బ్యాడ్ లక్!

బిబి జోడి సీజన్ 2 ఈ వారం శనివారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఈ షోలో సాయిశ్రీనివాస్ - నయనిపావని జోడి పెర్ఫార్మ్ చేసాక శ్రీనివాస్ వాళ్ళ సిస్టర్ అంబికా స్టేజి మీదకు వచ్చి ఒక టీ కప్ తీసుకొచ్చి గిఫ్ట్ చేసింది. ఇలాంటి ఆపర్చునిటీ తన బ్రదర్ కి ఇలా దొరకడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. రోజు ఈ కప్ లో కాఫీ తాగుతూ ఎలా కష్టపడాలి అని ఆలోచించాలి ఫైనల్ గా ఎలా బిబి జోడి కప్ తీసుకోవాలి అని ఆలోచించు అంటూ విష్ చేసింది.

తర్వాత శేఖర్ మాష్టర్ కూడా ఒక విషయాన్నీ చెప్పారు. "కరెక్ట్ గా లాక్ డౌన్ టైములో సాయి ఒక మూవీ చేసాడు. నా ఫ్రెండ్ అజయ్ మంచి కొరియోగ్రాఫర్. సాయి బాడ్ లక్ అజయ్ బాడ్ లక్ ఏంటంటే లాక్ డౌన్ వచ్చింది. ఆ టైములో మూవీని ఇక్కడ రిలీజ్ చేయలేకపోయారు. దాన్ని యూఎస్ లో రిలీజ్ చేశారు. నిజంగా అలాంటి మూవీ ఇప్పుడు వస్తే డెఫినెట్ గా నువ్వు చేతికి అందవు సాయి. మంచి పొజిషన్ లో ఉంటావు. చెప్తున్నా ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్స్ చూసి నీకు అవకాశం ఇస్తే గనక నీకు నువ్వు డెఫినెట్ గా ప్రూవ్ చేసుకోగలవు ఆ టాలెంట్ నీలో ఉంది" అని చెప్పారు.

ఇక నయని పావని కూడా ఒక విషయాన్నీ చెప్పుకొచ్చింది. "నాకు ఒక అక్క ఉంది. మా అక్క కూడా అంతే. తన లైఫ్ తనకు అస్సలు చూసుకోకుండా నేనేం చేయాలి నేనేం చేస్తే బాగుంటుంది అనేదే ఆలోచిస్తుంది. నేను ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం తనే. నా పేరు పావని. మా అక్క పేరు నయని. నేను మా అక్క పేరుని పెట్టుకున్నాను. నీ పేరు ఎప్పుడు నా లైఫ్ లోకి వచ్చిందో అప్పుడు నాకు అన్నీ వచ్చాయి .నాకు మా అక్క లక్కీ చార్మ్" అంటూ చెప్పింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.