English | Telugu
Brahmamudi: అప్పు, కావ్యల శ్రీమంతం కోసం ఏర్పాట్లు.. చీర తెచ్చిన కళ్యాణ్!
Updated : Jan 4, 2026
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -921 లో..... రాజ్ కార్ లో డబ్బున్న సూట్ కేసు పెట్టాలని రాహుల్, రుద్రాణి ప్లాన్ చేస్తారు. ఈ డబ్బు రాజ్ కార్ లో దొరికితే పోలీసులు తనని అరెస్ట్ చేస్తారని రుద్రాణి అనగానే బావని అరెస్ట్ చేస్తారా.. వద్దు నాకు కాబోయే భర్త అరెస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదని రేఖ అంటుంది. వాడు ఇప్పుడే నీ భర్త అయినట్లు మాట్లాడుతున్నావ్ ఏంటని రాహుల్ అంటాడు. రాహులేమో రాజ్ అరెస్ట్ కావాలని అంటుంటే.. వద్దని రేఖ అంటుంది. ఇద్దరికి రుద్రాణి సర్ది చెప్తుంది.
మరొకవైపు కావ్య, అప్పు వాకింగ్ చేస్తూ.. ఆయాసపడుతారు. అప్పుడే కనకం పంతులు గారిని తీసుకొని వస్తుంది. కావ్య,అప్పు వాళ్ళ అమ్మ రావడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. నా కూతుళ్ళని శ్రీమంతం కోసం తీసుకొని వెళ్ళడానికి వచ్చానని కనకం అనగానే నా కోడళ్ళు నా ఇంట్లోనే ఉండాలని అపర్ణ అంటుంది. ఆ శ్రీమంతం ఏదో ఇక్కడే జరిపిద్దామని ఇందిరాదేవి అనగానే కనకం కూడా సరే అంటుంది.
ఆ తర్వాత రాజ్, కళ్యాణ్ కలిసి శ్రీమంతం కోసం ఏర్పాట్లు చేస్తారు. ఏం అవసరం ఉంటాయో అన్నీ లిస్ట్ చేస్తారు. తమ భార్యలకి బంగారు గాజులు తీసుకొని రావాలని ఇద్దరు అనుకుంటారు. అప్పుడే కావ్య, అప్పు వస్తారు. అంతలోనే కనకం వస్తుంది. అల్లుడు గారు మేమ్ కష్టపడి కూతుళ్ల శ్రీమంతం కోసం డబ్బు దాచుకున్నాం.. ఆ డబ్బుతో శ్రీమంతం జరిపించండి అని రాజ్ ని కనకం రిక్వెస్ట్ చేస్తుంది. సరే అత్తయ్య మీరు బాధపడకూడదని తీసుకుంటున్నానని రాజ్ డబ్బు తీసుకుంటాడు.
అత్తయ్యని హ్యాపీగా ఉంచావ్.. కానీ ఈ శ్రీమంతం ఎలా చేస్తారో అన్న డౌట్ అయితే ఉందని కావ్య అనగానే అప్పుడే రేఖ ఎంట్రీ ఇచ్చి నేను దగ్గరుండి ఆర్గనైజ్ చేస్తాను.. ఫారెన్ లో చాలా చేసానని రేఖ అనగానే వద్దు నువ్వు ఆర్గనైజ్ చేసింది పబ్ లో.. ఇలాంటివి కాదు నేను చూసుకుంటానని రాజ్ అంటాడు.
మరొకవైపు అప్పు కోసం కళ్యాణ్ చీర తీసుకొని వస్తాడు. అప్పుడే అప్పు వాళ్ళ అమ్మ తెచ్చిన చీర తీసుకొని వస్తుంది. అప్పు రాగానే కళ్యాణ్ చీర దాస్తాడు. ఏమైందని అప్పు అడుగుతుంది. నేను చీర తీసుకొని వచ్చాను. నువ్వు ఏది కట్టుకోవాలో కన్ఫ్యూజన్ అవద్దు.. మీ అమ్మ తెచ్చిన చీర కట్టుకో ఎందుకంటే మీ అమ్మ ప్రేమతో తీసుకొని వచ్చింది కదా అని కళ్యాణ్ అనగానే కళ్యాణ్ ని అప్పు హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.