English | Telugu

Podharillu : చక్రి సాయంతో మహా పెళ్ళి నుండి తెప్పించుకుంటుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -21 లో.... మహా అన్నమాటలకి భూషణ్ కోపంగా ఉంటాడు. భూషణ్ తో అలా మాట్లాడినందుకు మహాపై ప్రతాప్ చెయ్ చేసుకుంటాడు. నన్ను సైకో అంటుంది. ఇలా పెంచారేంటి అంకుల్ అని ప్రతాప్ తో భూషణ్ అనగానే దానికేం తెలియదు బాబు ఈ ఒక్కసారికి క్షమించండి అని ప్రతాప్ అనగానే.. మా అమ్మవాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని భూషణ్ అంటాడు. వద్దు బాబు చెప్పకండి అని మహా వాళ్ల అమ్మ అంటుంది.

భూషణ్ వెళ్ళిపోయాక మహాతో మాట్లాడాలి వెళ్లి తీసుకొని రా అని ఆదిత్యని పంపిస్తాడు. అది వెళ్లి మహా నిన్ను డాడీ రమ్మంటున్నాడని చెప్తాడు. ఇంకా ఏమైనా అనేటివి ఉన్నాయా అని మహా కోపంగా మాట్లాడేసరికి హారిక నువ్వు తనని తీసుకొని రా అని ఆదిత్య చెప్పి వెళ్ళిపోతాడు. మహా కిందకి వస్తుంది. నువ్వు అల్లుడు గారితో ఇక బాగుండాలని‌ మహాతో వాళ్ళ నాన్న చెప్తాడు. వాడు నాకు ఇష్టం లేదని మహా అంటుంది. ఎందుకు ఇష్టం లేదు ఒక కారణం చెప్పమని అడుగుతాడు. నువ్వు ఇంకా ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని ప్రతాప్ అనగానే అందరు షాక్ అవుతారు. మీరు నా గురించి ఇలా మాట్లాడుతున్నారేంటి.. నేను ఎలాంటి దానినో మీకు తెలియదా అని మహా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఏది ఏమైనా భూషణ్ తో నీ పెళ్లి జరుగుతుందని ప్రతాప్ చెప్తాడు. అదంతా చక్రి వింటాడు. మహా గురించి చక్రి ఆలోచిస్తాడు. అప్పుడే మహా కోపంగా వచ్చి నేను ఇంట్లో నుండి వెళ్ళిపోదామనుకుంటున్న.‌ నా మనసు ఏంటో అర్థం చేసుకొని చోట నేను ఉండను కమ్యూనిటి గురించి ఆలోచిస్తున్నారు కానీ కన్నకూతురు గురించి ఆలోచించడం లేదు అలాంటప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి.. ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి నువ్వు హెల్ప్ చేస్తావా అని మహా అనగానే సరే అని చక్రి అంటాడు.

మరుసటిరోజు ప్రతాప్ , తన భార్య కులదైవం గుడికి వెళ్తుంటే.. అల్లుడు గారు ఫోన్ చేస్తే బాగా మాట్లాడమని ప్రతాప్ కోపంగా చెప్తాడు. మహా అసలు వాళ్ల నాన్న వైపు కూడా చూడదు. ఆ తర్వాత మహా వాళ్ల అమ్మ కార్ దగ్గర వరకు వెళ్లి.. మళ్ళీ మహా దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. తరువాయి భాగంలో మహా ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.