English | Telugu

యాంకర్ అనసూయ నా బిగ్ ఇన్​స్పిరేషన్

బుల్లితెర మీద యాంకర్ గా వైరల్ వంటలక్కగా ఫేమస్ ఐన ధరణి ప్రియా గురించి అందరికీ తెలుసు. ఆమె కొన్ని షోస్ లో చేస్తూ ఉంటుంది. కొన్ని షోస్ ని హోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటి ధరణి ఒక చిట్ చాట్ లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలను చెప్పుకొచ్చింది.

"నేను పక్కా హైద్రాబాదీ పిల్లను. ఘట్ కేసర్ మాది. బిటెక్ చదివే టైములో కాలేజీ డేస్ లాంటి షోస్ ఉండేవి కదా. కాలేజ్ కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల షోస్, చిట్ చాట్స్ జరిగేవి, కొన్ని గేమ్స్ లాంటివి కండక్ట్ చేసేవాళ్ళు. నేను డాన్స్ లో నంబర్ 1 కాబట్టి అంటే అనుకుంటూ ఉంటాను అలా నా డాన్స్ చూసిన ఒక ప్రోగ్రాం ప్రొడ్యూసర్ మీరు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. మీరు యాంకర్ గా ట్రై చేయొచ్చు అన్నారు.

ఇక వచ్చింది నా టైం అనుకుని నా కెరీర్ ని స్టార్ట్ చేసాను. ఒక లోకల్ ఛానల్ లో వీడియో జాకీగా ఎంట్రీ ఇచ్చాను. షూటింగ్ ఐపోయాక ఇంటికి వెళ్లి మా ఆయన భుజం మీద తలపెట్టి పడుకోవాలని అనుకుంటాను. అప్పుడు ఆ పని చేయి ఈ పని చెయ్యి అంటూ ఇరిటేట్ చేస్తాడు. నాకు కోపం తెప్పించడానికి రీజన్స్ వెతుకుతాడు అదే నాకు నచ్చదు. కెమెరాకి దూరంగా ఉండొద్దు అనే రిజల్యూషన్ ని ఈ ఇయర్ తీసుకున్నాను. ఇది నా టైం కాబట్టి నేను కెమెరాకు దూరంగా ఉండకూడదు, చాలామంది మెప్పు పొందాలి అనుకుంటున్నాను.

ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ కానీ యాంకర్ అనసూయ నా బిగ్ ఇన్స్పిరేషన్ . చాలా సపోర్ట్ చేసింది. తన కజిన్ కావడం నిజంగా గర్వంగా ఉంటుంది. 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాక ఇప్పుడు వైరల్ వంటలక్క షోతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చాను. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆదర్శ్ తో కలిసి "శుభలేఖ రాసుకున్న" సాంగ్ కి డాన్స్ చేసాను. మా పెయిర్ కి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆదర్శ్ నాకు డాన్స్ లో బెస్ట్ కో-స్టార్. నా డ్రీం రోల్ బెస్ట్ యాంకర్ గా చేస్తూ ఉండాలి..డబ్బు కన్నా మనిషే గొప్ప. డబ్బు ఈరోజు కాకపోతే రేపు సంపాదించొచ్చు కానీ మనిషిని సంపాదించలేము" అంటూ చెప్పుకొచ్చింది ధరణి ప్రియా.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.