డియర్ ప్రదీప్...సుధీర్ బావాయనమః ...బ్యాచిలర్ హోస్ట్స్ కి లవ్ లెటర్స్
బుల్లితెర మీద సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. షోస్, ఈవెంట్స్ కంటే ముందు ప్రోమోస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక జీ తెలుగులో "సంక్రాంతి అల్లుడు పండగకి వస్తున్నారు" షోకి సంబందించిన మరో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కావ్య, భూమిక, ఆనాల సుష్మిత వీళ్ళు ప్రదీప్ కి, సుధీర్ కి లవ్ లెటర్స్ రాసి ఇంప్రెస్ చేశారు. ఎవరెవరు ఎం రాసారంటే "ఓం సుధీర్ బావాయనమః నీ అందం పాలపుంత, నీ స్పర్శ తాకితే పులకింత" అంటూ ప్రదీప్ సుధీర్ కి సుష్మిత రాసిన లేఖ చదువుతూనే ఆమెను కొరికేసేలా చూస్తూ ఉన్నాడు.