English | Telugu

పెళ్లయ్యాక రొమాన్స్ చచ్చిపోయింది...


చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే మాత్రం ప్రతీ వారం ఆడియన్స్ ని నవ్విస్తూనే ఉంది. ఈ వారం ఎపిసోడ్ లో యాదమ్మ రాజు తన సహా కంటెస్టెంట్ సుప్రీతతో కలిసి వచ్చాడు. వీళ్లకు బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా "మోత మోగిపోద్ది" అనేది వచ్చింది. యాదమ్మ రాజు, సుప్రీతా డాన్స్ చేస్తూ ఉండగా మధ్యలో అమర్ దీప్ వచ్చి సుప్రీతతో డాన్స్ చేయడంతో రాజు నోరెళ్లబెట్టాడు. దాంతో సుమ అమర్ ఒక్కసారన్నా రాజుతో ఒక్క ఎపిసోడ్ అన్నా డాన్స్ చేయనివ్వవా అని అడిగింది. దాంతో అమర్ "మంచి సాంగ్ పెడుతుంటే రాజు వాడుకోవట్లేదు" అన్నాడు. "నేను డాన్స్ చేస్తుంటే అలా నన్ను వదిలేసి నడిచి వెళ్ళిపోతోంది" అంటూ పాపం రాజు తెగ ఫీలయ్యాడు.

ఆ వెంటనే సుప్రీతా వచ్చి "రాజు కోసం మాత్రమే వేరే సాంగ్ పెట్టండి" అంది. ఐతే ఆ సాంగ్ కి డ్యూయెట్ స్టెప్ ని సుప్రీతాతో కలిసి వేయలేకపోయారు. ఇంకేముంది రాజుని వదిలేసి తన వర్క్ స్టేషన్ కి వెళ్ళిపోయింది సుప్రీతా. "నాకు ఇంటరెస్ట్ పోయింది" అంది సుప్రీతా. "మాకు మాత్రం ఉందా ఏంటి" అంది సుమ. "పెళ్లయ్యాక నాలో రొమాంటిక్ యాంగిల్ పోయింది మేడం లోపల" అన్నాడు రాజు. దానికి సుమ నవ్వేసి " మీ లైఫ్ లో ఉన్న స్వీటెస్ట్ మెమరీ ఏమిటి" అని అడిగింది సుమ. "స్వీటెస్ట్ మెమొరీ అంటే మెమరీ కార్డు మేడం అని జోక్ వేస్తూనేరీసెంట్ గా మాకు ఒక పాప పుట్టింది అదే స్వీట్ మెమరీ" అన్నాడు. "అంటే ఇంత అన్ రొమాంటిక్ గా ఉన్నావ్ స్టెల్లాతో నువ్వు ఎలా ఉంటావా" అని సందేహం అంటూ రాజుని అడిగింది సుమ. "నేనేం ఉండను మేడం ఆమెనే ఉంటుంది నాతో అలా" అని కామెడీ చేసాడు రాజు. ఇలా రాజు, సుప్రీతా, సుమ కలిసి కామెడీ చేశారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.