English | Telugu

Eto Vellipoyindhi Manasu : వాళ్ళిద్దరిని పెళ్ళి చేసుకోమన్న రామ్.. టెన్షన్ లో సవతి తల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -376 లో..... రామాలక్ష్మిని రామ్ కలవడానికి వస్తాడు. మీరు నాతోనే ఉండండి మిస్.. ఎక్కడికి వెళ్లొద్దని రామ్ అంటాడు. లేదు వెళ్ళాలని రామలక్ష్మి అనగానే.. రామ్ కిందపడిపోతాడు. రామలక్ష్మి వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. అప్పుడే సీతాకాంత్, శ్రీవల్లి, సందీప్ , శ్రీలత అందరు హాస్పిటల్ కి వస్తారు. లోపల రామ్ కి ట్రీట్ మెంట్ జరుగుతుంటే నీ వళ్లే ఇదంతా.. మా రామ్ ని ఏం చేసావ్.. మొన్న ఎంగేజ్ మెంట్ రోజు ఏదో చెప్పి రామ్ ని వెళ్లేలా చేసావ్‌‌‌.. ఇప్పుడు ఏం చెప్పావో ఇప్పుడు ఇలా అయిందంటు రామలక్ష్మిని శ్రీలత తిడుతుంది.

నేను ఏం అన్లేదని రామలక్ష్మి చెప్తుంది. అయిన వినకుండా శ్రీవల్లి, శ్రీలత ఇద్దరు రామలక్ష్మిపై కోప్పడతారు. సైలెంట్ గా ఉండండి అని సీతాకాంత్ కోప్పడతాడు. డాక్టర్ బయటకు వచ్చి బాబు హార్ట్ లో చిన్న హోల్ ఉంది. మీరు ఆతన్ని ఎక్కువ స్ట్రెస్ చెయ్యకండి. తనని బాధపెట్టకండి అని డాక్టర్ చెప్తాడు. రామ్ స్పృహలోకి రాగానే అందరు వెళ్తారు. మిస్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్లొద్దని చెప్తాడు. మీరు ఇద్దరు పెళ్లి చేసుకోండి. ఎప్పుడు ఒక దగ్గర ఉండొచ్చని రామ్ అంటాడు. దాంతో రామలక్ష్మి సైలెంట్ గా ఉంటుంది. వీడెంటి ఇలా మాట్లాడుతున్నాడని శ్రీలత, సందీప్, శ్రీవల్లి టెన్షన్ పడతారు.

అప్పుడే డాక్టర్ వచ్చి అతన్ని ఎక్కువ గా స్ట్రెస్ చెయ్యకండి తన మనసులో ఏముందో తెలుసుకొని తనకి నచ్చింది చెయ్యండి అని చెప్తాడు. మరొకవైపు ఫణీంద్ర, సుశీల ఇద్దరు రామలక్ష్మి ఇంకా రాలేదని టెన్షన్ పడుతుంటే.. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. జరిగిందంతా చెప్తుంది. అంత చిన్న బాబుకి అలాంటి పరిస్థితి వచ్చిందని వాళ్ళు బాధపడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.