English | Telugu

కోడిని చంపి కుక్కకు పెడతావా...మళ్ళీ పక్షులను కాపాడాలా...ఇదేం లెక్క

ఈ వారం ఢీ షోలో అశ్విని పరువు తీసేసాడు ఆది. మెంటార్ ప్రభు మాష్టర్ ఆధ్వర్యంలో సాగర్ - శృతి వచ్చి డాన్స్ చేశారు ఐతే సేవ్ బర్డ్స్ అనే కాన్సెప్ట్ తో వీళ్ళు డాన్స్ చేశారు. డాన్స్ తర్వాత అశ్విని నాలుగు మాటలు మాట్లాడింది. పక్షుల్ని కాపాడాలి. అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్లంతా మెష్ లు వేసేసుకుంటారు. పక్షులకు కొంచెం వాటర్ కొంచెం ఫుడ్ పెట్టండి. లేదంటే చచ్చిపోతాయి ఎండాకాలం కదా అని చెప్పింది. దానికి ఆది కౌంటర్ వేసాడు. "డిన్నర్ లో కోడి తిన్నది" మళ్ళీ వాటి గురించి మాట్లాడుతోంది అన్నాడు ఆది. " వాటికి ఫుడ్ పెట్టండి, నీళ్లు పెట్టండి అంటారు చాలామంది. మళ్ళీ పక్కకు వెళ్లి అందరూ లెగ్ పీస్ తినేస్తారు." అన్నాడు ఆది. "నేను తింటానేమో కానీ నేను రోజు 30 డాగ్స్ కి ఫీడ్ చేస్తాను.

మా అమ్మ రోజూ ఉదయాన్నే చికెన్ రైస్ వండి స్ట్రీట్ డాగ్స్ కి పెడుతుంది" అంది అశ్విని. "కోడిని చంపి కుక్కకు పెడతారంట. దాన్ని చాల మంచి విషయంగా చెప్తోంది. అంటే పావురాలను, కుక్కలను తినం కాబట్టి వాటి మీద జాలి పడాలి..ఇదేం లెక్క" అన్నాడు ఆది. "మీరొక్కళ్ళు చాలండి నేను ఎన్ని మంచి మాటలు చెప్పినా ఒక్క మాటతో పరువు తీసేస్తారు" అంటూ అశ్విని ఫీలయ్యింది. ఐతే ఎవరు తిన్నా తినకపోయినా..మూగజీవాలకు మాత్రం గుప్పెడు గింజలు. కొంచెం వాటర్ పెడితే వాటికి నిజంగా ఎంతో పుణ్యం అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఆ భూతదయ అనేది ప్రతీ ఒక్కరికీ ఉండాలి. అసలే ఎండాకాలం. ఠారెత్తిస్తున్నాయి ఎండలు. ఇలాంటి టైంలో ఎవరైనా కూడా వాటికి చేతనైన సాయం చేయడం ఒక మంచి విషయం అంటూ అశ్విని చెప్పడంతో హోస్ట్ నందు కూడా ఆ విషయాన్ని మెచ్చుకున్నాడు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.