English | Telugu
Brahmamudi : కొడుకుని చూసి మురిసిపోయిన అపర్ణ.. వాళ్ళని చూసి యామిని షాక్!
Updated : Apr 18, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -698 లో.....అపర్ణ వదినని, కావ్యని చూస్తుంటే నాకూ డౌట్ గా ఉందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. మరొకవైపు కావ్య గిఫ్ట్ గా పంపిన షర్ట్ ని రాజ్ వేసుకొని మురిసిపోతుంటాడు. షర్ట్ బాగుందని వైదేహి అంటుంది. మా అమ్మాయి తీసుకొచ్చిందా అని రాజ్ ని వైదేహి అడుగుతుంది. లేదు బావే ఆర్డర్ పెట్టుకున్నాడని యామిని అంటుంది. అవునా చాలా బాగుందని యామిని పేరెంట్స్ అంటారు.
మీకెలా నచ్చిందో నాకు అర్థం అవ్వడం లేదు నాకు అయితే నచ్చలేదు ఓల్డ్ గా ఉంది. రెండు మూడుసార్లు వాడి పడేసినట్లు ఉందని యామిని అనగానే నీకేం తెలుసు అన్ని అలా చూడకూడదు మనసుతో చూడాలని రాజ్ అంటాడు. బావ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని యామిని అడుగుతుంది. శివాలయం దగ్గరికి అని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఎందుకు అడిగావని యామినిని వైదేహీ అడుగుతుంది. జీపీ ఎస్ ద్వారా మనకి తెలుస్తుంది కానీ బావ మనకి అబద్ధం చెప్తున్నాడో లేదో తెలుస్తుంది కదా అని యామిని అంటుంది. ఆ తర్వాత అపర్ణ, కావ్య ఇద్దరు రాజ్ కోసం వెయిట్ చేస్తారు. రాజ్ అప్పుడే వస్తాడు. తనని చూసి అపర్ణ షాక్ అవుతుంది. నా కొడుకు బ్రతికే ఉన్నాడని అపర్ణ మురిసిపోతుంది. అత్తయ్య మీరు ఆయన ముందు బయటపడొద్దని కావ్య పదేపదే చెప్తుంది. సరే ఒకసారి అటుగా వెళ్తానని రాజ్ పక్క నుండి అపర్ణ వెళ్తుంది. అపర్ణ పడిపోబోతుంటే రాజ్ అమ్మ అంటు పట్టుకుంటాడు. ఆ తర్వాత అమ్మ అని పిలవగానే అదంతా దూరం నుండి చూస్తున్న కావ్య ఆయనకు గతం గుర్తు వచ్చిందా అని అనుకుంటుంది. అమ్మ ఈ కర్చీఫ్ మీదేనా అని రాజ్ అడుగుతాడు. నాదే అని అపర్ణ తీసుకుంటుంది.
ఆ తర్వాత అపర్ణని కావ్య పక్కకి తీసుకొని వస్తుంది. నా కొడుకుని అలా చూసి మాట్లాడకుండా ఉండలేకపోయానని అపర్ణ అంటుంది. రాజ్ దగ్గరికి కావ్య వెళ్తుంది. ఇద్దరిని చూసిన పంతులు గారు.. మీ జంట బాగుందని అంటాడు. ఆ మాట అపర్ణ విని మురిసిపోతుంది. తరువాయి భాగంలో రాజ్ , కావ్య ఇద్దరు కలిసి అపర్ణ చేత కేక్ కట్ చేయిస్తారు. అదంతా యామిని చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.