English | Telugu

బెజవాడ బేబక్క : నేనూ పచ్చళ్ళు చేస్తా..ఫేమస్ అవుతా


కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. పచ్చళ్ళు, బూతులు, పనికిమాలిన కోతలు కాదేది ఫేమస్ కావడానికి అనర్హం అని అంటోంది ఇప్పటి సోషల్ మీడియా. పచ్చళ్ళ టాపిక్ కొన్ని రోజుల పాటు ఎలా ఫేమస్ అయ్యిందో అందరం చూసాం. ఇక ఇప్పుడు బెజవాడ బేబక్క కొత్త నిర్ణయం తీసుకుంది...పచ్చళ్ళ టాపిక్ డైవర్ట్ అవుతున్న టైములో మళ్ళీ అదే టాపిక్ ని తీసుకొస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోని పోస్ట్ చేసింది. "నేను కూడా పచ్చళ్ళు చేసి ఫేమస్ అవుదామనుకుంటున్నాను. వంకాయ రొయ్యల పచ్చడి..స్వయానా నేనే వేయించాను. అదిగో వేయించిన నూనె కూడా ఉంది.

వేస్తున్న తాలింపు సాక్షిగా చెప్తున్నా నేను కూడా ఇక పచ్చళ్ళు చేస్తా..ఫేమస్ అవుతా.. మీమీదొట్టు" అంటూ తాలింపు గిన్నెను జనాలకు చూపిస్తూ మరీ చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్స్ కూడా కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు. " పచ్చళ్ళు ఒక్కటే కాదు బేబక్క పచ్చళ్ళతో పాటు బూతులు తిడితే బాగా ఫేమస్ అవుతారు.. మేము ఏం పాపం చేసాము అక్కా మా మీద ఒట్టేస్తున్నావ్...మాకు కూడా ఒక కేజీ పచ్చడి పంపించండి. నెక్స్ట్ వైరల్ వీడియో బెజవాడ బేబక్క పికిల్స్ విత్ స్పెషల్ బూతులు..అక్కా నువ్ ఆల్రెడీ ఫేమస్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బేబక్క గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..ఈమె చేసే షార్ట్ వీడియోస్ ఫుల్ వైరల్ అవుతూ ఉంటాయి...పాపాలు చేయండి ఎక్కువ కాలం బతుకుతారు అంటూ చేసిన ఒక రీల్ తో ఈమె ఫుల్ పాపులర్ అయ్యింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో ఈమె కంటెస్టెంట్ గా వెళ్లి వెంటనే ఎలిమినేట్ ఐపోయి వచ్చేసింది. ఈమె మంచి సాంగ్స్ కూడా పాడుతుంది. అలాగే తెలుగులో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. "యో బేబీ..హులలే" అంటూ ఒక మ్యూజిక్ ఆల్బం కూడా చేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.