English | Telugu

హజ్బెండ్ లేకపోతే చాలా అషన్స్ గా ఉంటాయి..అన్షు ఆన్సర్ మాములుగా లేదు

ఇప్పుడు అందరికీ సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. ఇంట్లో చల్ల చల్లగా డ్రింక్స్ చేసుకుంటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక లేడీస్ ఐతే కూల్ కూల్ గా మూవీస్, షోస్ చూస్తూ ఉన్నారు. దాంతో ఈ సమ్మర్ కాన్సెప్ట్ తో స్టార్ మా సమ్మర్ స్పెషల్ తో నెక్స్ట్ వీక్ రాబోతోంది.ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి కార్తీక దీపం సీరియల్ నుంచి డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ వచ్చాడు. అలాగే ఇల్లు, ఇల్లాలు పిల్లలు సీరియల్ నుంచి నర్మదా లీడ్ అన్షు రెడ్డి వచ్చింది.

ఇంకా గుండె నిండా గుడి గంటలు సీరియల్ నుంచి బాలు అలియాస్ విష్ణు, మగువా ఓ మగువా సీరియల్ నుంచి సింధూర అలియాస్ కృతిక, బిగ్ బాస్ సీజన్ 8 టేస్టీ తేజ, నిఖిల్, గౌతమ్ కృష్ణ, ప్రేరణ, విష్ణు ప్రియా వచ్చారు. ఈ ఎపిసోడ్ లో గెలిచిన వాళ్ళను కాశ్మీర్ ట్రిప్ వెళ్ళబోతున్నారంటూ శ్రీముఖి అనౌన్స్ చేసింది. ఇక డాక్టర్ బాబు ఐతే బీచ్ వెళ్ళినప్పుడు వేసుకెళ్లే గెటప్ తో ఎంట్రీ ఇచ్చాడు. "సమ్మర్ లో కూల్ కూల్ గా చేసే పనులేంటో చెప్పరా" అంటూ డాక్టర్ బాబుని అడిగింది శ్రీముఖి. కూల్ గా తీసుకోవాలి అనేసరికి బ్యాక్ గ్రౌండ్ లో బోటిల్ మూత తీసిన సౌండ్ రావడంతో అందరూ నవ్వేశారు. ఆ తర్వాత అన్షు రెడ్డిని "వెకేషన్ విత్ హజ్బెండ్ వెకేషన్ విత్ అవుట్ హజ్బెండ్ అని అంటే" అంటూ అడిగింది శ్రీముఖి. "హజ్బెండ్ ఉంటే ఒక్కడే ఉంటాడు. హజ్బెండ్ లేకపోతే చాలా మంది అషన్స్ గా ఉంటారు" అని చెప్పింది. అంతే శ్రీముఖి ఆ ఆన్సర్ కి షాకయ్యింది. "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ లో రెండో కోడలిగా నటిస్తోంది అన్షు రెడ్డి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.