English | Telugu

Illu illalu pillalu: కొడుకుని చూసి గర్వంగా ఫీల్ అయిన రామరాజు.. ధీరజ్ ఎమోషనల్!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-140 లో.. శ్రీవల్లిని ప్రేమ అవమానించిన తన భర్త ధీరజ్ సపోర్ట్ చేయకపోవడంతో తను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటుంది.‌ ఇక ఇల్లు దాటి గీత దాటుతుండగా ప్రేమ ఆగిపోతుంది. ఇక అప్పుడే తన పక్కకి ధీరజ్ వస్తాడు. నీ అడుగు ఈ గీతను దాటదు ప్రేమా అని అంటాడు. అడుగుదాటకపోవడం కాదు.. నువ్వే అడుగుముందుకు వేయలేవు. ఎందుకంటే.. ఏదో తెలియని బంధం నీ మనసుని కాళ్లని కట్టిపడేస్తుంది. మనకి తెలియకుండానే ఇష్టంలేని బంధంలో ఇరుక్కునిపోయాం. మన జీవితాల గురించి మనం నిర్ణయం తీసుకునే పరిస్థితిలో మనం లేము ప్రేమా.. ఎందుకంటే మనది ఇష్టం లేని ప్రయాణం. కానీ కలిసి నడవాల్సిన పరిస్థితి. అలాగని నిన్న ఆగమని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం.. నచ్చినా నచ్చకపోయినా.. ఏం జరిగినా ఎవరేమన్నా.. మనం భరించాల్సిందే.. కలిసి అడుగులు వేయాల్సిందేనని ధీరజ్ అంటాడు. ఆ మాటతో ప్రేమ అవుతుంది. నీ బాధకి కారణం మా వదిన ఏదో మాట్లాడిందనే కదా.. ఒక్కసారి మా వదిన స్థానంలో నువ్వు ఉండి ఆలోచించు. ఇంకో గంటలో తన మెడలో తాళి పడబోతుందనగా.. తన భర్తని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లారు. ఆ క్షణంలో ఓ ఆడపిల్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ప్రేమా అని ధీరజ్ అంటాడు.

పెళ్లికి వచ్చిన వాళ్లు నానా మాటలు అంటే.. ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఆమెను కన్నవాళ్ల పరిస్థితేంటి? కొడుకు పెళ్లిపీటలపై ఆగిపోతే మా అమ్మనాన్నల పరిస్థితేంటి? వాళ్లకి ఎంత నరకమో ఒక్కసారి ఆలోచించు. మా వదిన మాట్లాడిన విధానం తప్పు అయ్యి ఉండొచ్చు కానీ.. తన బాధలో అర్థం ఉంది. ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది ప్రేమా.. తరువాత నీ ఇష్టమని ధీరజ్ సర్దిచెప్తాడు. దాంతో ప్రేమ గీత దాటకుండ వెనక్కి వచ్చేస్తుంది. ఇక రామరాజు అయితే కొడుకు పెళ్లైపోయిందనే ఆనందంలో చాలా రోజుల తర్వాత తిరుపతితో కలిసి మందేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. నిన్ను చాలా రోజుల తర్వాత ఇంత సంతోషంగా చూస్తున్నాను బావా అని తిరుపతి అంటాడు. ఈ సంతోషానికి కారణం నా చిన్న కొడుకురా అని రామరాజు అంటాడు. ఆ మాట విన్న ధీరజ్ ఎమోషనల్ అయిపోతాడు. అవునురా తిరుపతీ.. ఈ మాట మనస్పూర్తిగా చెప్తున్నా పెళ్లి మండపంలో పెద్దోడు లెటర్ రాసి వెళ్లిపోయాడని చాలా బాధపడ్డానురా.. వాడు అలా చేశాడంటే నమ్మేశానురా కానీ నా చిన్నకొడుకు మాత్రం.. అన్నయ్య తప్పు చేయడు.. మా నాన్నని బాధపెట్టడని బలంగా నమ్మాడురా.. ముహూర్తం టైమ్ కి అన్నయ్యని తీసుకొస్తా.. మీ కళ్లల్లో సంతోషం నింపుతా అన్నాడు.. నింపాడు. చిన్నోడు వాళ్ల అన్నయ్య జీవితాన్ని నిలబెట్టడమే కాదు.. నా ప్రాణాలను నిలబెట్టాడు. దానికి వాడు పెద్ద యుద్దమే చేశాడురా నా చిన్న కొడుకు. ఒకవేళ పెద్దోడి పెళ్లి ఆగిపోయి ఉంటే ఆ బాధలో ఈ గుండె ఆగిపోయేదిరా. నిలబడ్డాడ్రా.. నా చిన్న కొడుకు నా కోసం ఈ ఇంటికోసం నిలబడ్డాడ్రా. వాడు బాధ్యత తెలియని ఆకతాయి అనుకున్నా. కానీ వాడు నాలాగేరా.. కుటుంబానికి ఆపద వస్తే ప్రాణం పెట్టేస్తాడ్రా.. నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా.. నా కొడుకులు జెమ్స్ అని. నా చిన్నకొడుకు మాత్రం నెంబర్ వన్ జెమ్‌.. వాడి విషయంలో నాకు గర్వంగా ఉందని రామరాజు ఎమోషనల్ అవుతాడు. ఆ మాటలు విని ధీరజ్ సంతోషపడతాడు.

మరి ఈ మాట.. చిన్నోడితో చెప్పొచ్చు కదా బావా? ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు బయటపడటం లేదు.. చిన్నోడ్ని దగ్గరకు తీసుకుంటూ వాడూ సంతోషపడతాడు కదా బావా అని తిరుపతి అనగానే.. నా కొడుకుని దగ్గరకు తీసుకోకుండా నేను ఎందుకు ఉంటానురా.. కానీ ఒక్క విషయంలో వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు. నాన్నా ఈరోజు నుంచి మీతో శభాష్ అనిపించుకుంటానని చెప్పి.. నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ ఎదురింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడ్రా వాడూ.. అసలు అక్కడేం జరిగింది.. వీడెందుకు ఇలా చేశాడూ.. ఆ విషయం ఇప్పటికీ చెప్పలేదు. ఎప్పటికైనా ఆ నిజాన్ని వాడు చెప్తాడని చూస్తున్నా.. అప్పుడు నా చిన్న కొడుకుని గర్వంగా గుండెలకు హత్తుకుని.. ఈ సంతోషాన్ని వాడితో పంచుకుంటానని రామరాజు అంటాడు. చిన్నోడు ఇప్పటికే బాధ్యతల్ని తెలుసుకున్నాడు బావా.. వాడ్ని త్వరలోనే దగ్గరకు తీసుకుంటావ్ చూడు అని తిరుపతి అంటాడు. ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నానురా.. ఏదేమైనా ఈ ఇంటికి తగిలిన దిష్టి ఈరోజుతో పోయిందిరా.. మహాలక్ష్మి లాంటి కోడలు రావడంతో ఈ ఇంటికి కళ వచ్చేసిందిరా.. ఎంత వెతికిన కూడా అంతమంచి అమ్మాయిని పెద్దోడి భార్యగా తీసుకుని రాలేపోయేవాడ్ని.. నా పెద్ద కోడలు నా కుటుంబాన్ని నిలబెడుతుందిరా అని రామరాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.