English | Telugu

రాంప్రసాద్ పచ్చళ్ళల్లో ఆ రకమైన పచ్చళ్ళు కూడా లభ్యం

జబర్దస్త్ ఈ వారం షో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఐతే పికిల్స్ ఎపిసోడ్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో మనకు తెలుసు. ఇప్పుడు రాంప్రసాద్ కూడా అదే కాన్సెప్ట్ తీసుకున్నాడు. రాంప్రసాద్ పికిల్స్ పేరుతో ఒక స్కిట్ చేసాడు. ఇందులో పికిల్స్ అమ్మడమే కాదు పికిల్స్ పెట్టడంలో ట్రైనింగ్ కూడా ఇస్తాం అని చెప్పాడు. ఐతే ఇందులో ఆ టైపు పచ్చాలు కూడా ఉంటాయని చెప్పాడు. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ ఐన పికిల్స్ ట్రోలింగ్ చూస్తే ఒక వెరైటీ కామెంట్ ని కూడా చూసాం. ఒక సంస్థ వాళ్ళు పెట్టిన పచ్చడి తినడం వలన ప్రెగ్నెంట్ అయ్యారంటూ ఒక కస్టమర్ పెట్టిన ఒక మెసేజ్ కూడా పాయింట్ బాగా వైరల్ అయ్యింది. ఇక్కడ రాంప్రసాద్ కూడా అలాంటి ఒక పాయింట్ ని యాడ్ చేసాడు. దొరబాబు పచ్చళ్ళు కొనుక్కోవడానికి వచ్చాడు. ఏ రకమైన పచ్చళ్లయినా మీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు.

"మగాడిని మగాడిగా నిరూపించే పచ్చళ్ళు కూడా మన దగ్గర ఉన్నాయి" అన్నాడు రాంప్రసాద్. "అవునా దానికి టాబ్లెట్స్ ఉన్నాయిగా" అన్నాడు దొరబాబు. "ఆ టాబ్లెట్స్ ఆ పచ్చళ్ళల్లో వేసేస్తాం" అన్నాడు రాంప్రసాద్. "నువ్వు ఈ పచ్చడి తింటే నీలో కోరికలు పరిగెడతాయి..నీలో దాహం తీరదు" అని పచ్చళ్ళు కొనుక్కునేలా రెచ్చగొట్టాడు. ఐతే మరి పచ్చడి చెడిపోకుండా ఉండాలంటే ఎం చేయాలి అన్నాడు దొరబాబు. "నువ్వు కొంచెం దూరంగా ఉండాలి" అన్నాడు రాంప్రసాద్. ఐతే ఇన్ని రోజులు నీ దగ్గర ఉందిగా సగం చెడిపోయి ఉంటుందిగా అంటూ రివర్స్ పంచ్ వేసాడు దొరబాబు. ఇక దొరబాబు వైఫ్ గా చేసిన శ్రీదేవి రాంప్రసాద్ ని కొట్టి "నువ్వు పచ్చళ్ళు అమ్ముతున్నావా కాపురాలు చెడగొడుతున్నావా" అంటూ పంచులేసింది.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.