English | Telugu

అంత మంది చనిపోయారు అన్న చిన్న ఫీల్ కూడా లేదు ? నువ్వు సేఫ్ గానే ఉంటావులే  



పహల్గాంలోపరిస్థితి అద్వానంగా ఉంటే ఆర్జే కాజల్ మాత్రం అక్కడంతా ప్రశాంతంగా ఉందని, రోడ్స్ అంతా క్లియర్ గా ఉన్నాయని..వాళ్లంతా సేఫ్ గా ఉన్నామంటూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. కాశ్మీర్ ట్రిప్ లో ఉన్నామని లేటెస్ట్ అప్ డేట్ ఇస్తున్నాను అంటూ పెహెల్గాం నుంచి శ్రీనగర్ కి వెళ్తున్నామని చెప్పింది. అంతా ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉంది అని చెప్పింది. తన గురించి ఆలోచన వెల్ విషర్స్ , ఫ్రెండ్స్ అంతా కాల్ చేస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు. ఐతే అక్కడ తాను సేఫ్ గా ఉన్నాను అని చెప్పింది. అలాగే లోకల్ పోలీసులు కూడా అంతా జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెప్పింది. కాశ్మీర్ ఎప్పటిలానే సేఫ్ గా ఉంది.

కాబట్టి ఎవరూ టెన్షన్ పడొద్దు అని చెప్పింది. ఇక కిర్రాక్ సీత, గాయత్రి భార్గవి, ప్రియాంక సింగ్, జ్యోతక్క అంతా టేక్ కేర్ అంటూ మెసేజెస్ పెట్టారు. ఇక నెటిజన్స్ ఐతే కాజల్ మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు .."ఏంటి కాశ్మీర్ సేఫ్ గా అందంగా ఉందా..25 మందిని చంపాక ..నీ స్క్రిప్ట్ పని చూసుకో ...కాశ్మీర్ ముస్లిమ్స్ కి సేఫ్...నిద్ర లేమ్మా కాశ్మీర్ ముస్లిమ్స్ కి సేఫ్ కానీ హిందుస్ కి కాదు. మీకు పర్వాలేదు లెండి. వాళ్ళు ముందుగానే ఐడి కార్డ్స్ చెక్ చేసుకుని చంపారు..బ్యూటిఫుల్ ఏంటి..అక్కడ అంత మంది చనిపోయారు అన్న చిన్న ఫీల్ కూడా లేదు ? ఇక ఈ ఉగ్ర దాడి మీద సినీ నటులంతా కూడా స్పందిస్తున్నారు. రేణు దేశాయ్, చిరంజీవి, ఎన్టీఆర్ వంటి వాళ్లంతా ఈ దాడిని ఖండించారు. ఆర్జే కాజల్ బిగ్ బాస్ సీజన్ 5 కి వెళ్లొచ్చి బాగా ఫేమస్ అయ్యింది. కొన్ని వెబ్ సిరీస్ లో నటించింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.