English | Telugu
'మాస్ట్రో' ఎడిటర్‌కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన నితిన్!!
Updated : Jun 16, 2021
యూత్ స్టార్ నితిన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది 'చెక్', 'రంగ్ దే' సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు నితిన్. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయి. ఈ ఏడాది మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ 'మాస్ట్రో' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
'మాస్ట్రో' తరువాత కూడా నితిన్ వరుస ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్న నితిన్.. మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. బిజినెస్ మ్యాన్, టెంపర్ వంటి చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసిన ఎస్.ఆర్.శేఖర్ దర్శకుడిగా మారబోతున్నాడట. ఇటీవల నితిన్ కి ఆయన ఒక స్టోరీ చెప్పాడని, అది నచ్చడంతో నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.
ప్రస్తుతం శేఖర్ 'మాస్ట్రో'కి ఎడిటర్ గా చేస్తున్నాడు. నితిన్ కోసం ఆయన ఒక యాక్షన్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది 'భీష్మ' మూవీతో సూపర్ సక్సస్ అందుకున్న నితిన్.. ఇప్పుడు శేఖర్ చెప్పిన స్క్రిప్ట్ కూడా ఆ రేంజ్ సక్సెస్ అందుకుంటుందన్న నమ్మకంతో ఓకే చెప్పినట్లు సమాచారం.